Monday, December 23, 2024

ప్రభుత్వ పాఠశాలల్లో సకల సౌకర్యాలు

- Advertisement -
- Advertisement -

హస్తినాపురం: ప్రభుత్వ పాఠశాలల్లో సకల సౌకర్యాలు కల్పిస్తూ విద్యాభివృద్ధికి పెద్దపీట వేశామని ఎల్‌బినగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు. పేద విద్యార్థుల కోసం ఉ చితంగా పాఠ్య పుస్తకాలు, నోటుబుక్కులు, దుస్తులు, నాణ్యమైన అహారం అందిస్తూ విద్యాలయాలకు కావలసిన మౌలిక వసతులన్నీ కల్పిస్తూ విద్యార్థులను ఆకర్షించే విధంగా భవనాలను, పరిసరాలను తీర్చిదిద్దుతున్నామని తెలిపారు.

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది విజయోత్సవాలలో భాగంగా హస్తినాపురం డివిజన్ నందనవనం పాఠశాల విద్యాధికారులు మంగలవారం విద్యా దినోత్సవం మన ఊరు మన బడి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి పాల్గొన్నారు. భవనం పున:నిర్మాణానికి భూమి పూజ చేశారు.

విద్యాలయానికి కావలసిన అన్ని హంగులతో ఆదునీకరించనున్నామన్నారు. ఓవర్సిస్ స్కాలర్‌షిప్ పథకంతో పేద విద్యార్థులకు విదేశి విద్య కల సాకారం అవుతున్నదని చెప్పారు. జిహెచ్‌ఎంసి ఎల్‌బినగర్ డిప్యూటీ కమిషనర్ సురేందర్‌రెడ్డి, పాఠశాల హెచ్‌ఎం ప్రభాకర్‌రావు, రజితమ్మ, రాజు, విద్యావతి, బిఆర్‌ఎస్ డివిజన్ అధ్యక్షులు సత్యంచారి, నాయకులు గజ్జెల మధుసూధన్‌రెడ్డి, రఘుమారెడ్డి, డేరంగుల కృష్ణ, రాజిరెడ్డి, మహిళ అధ్యక్షురాలు అదిలక్ష్మి, లక్ష్మిప్రసన్న, బాలం ఈశ్వర్, శ్రీనివాస్‌యాదవ్, శివారెడ్డి, నాగిరెడ్డి, అనిత, అరుణ్, చారి, ఉమ, మహేశ్వరం సురేందర్‌రెడ్డి, సత్యప్రకాశ్, భానుప్రకాశ్, చంద్రమౌలిచారి, గోపినాయక్ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News