ఇది చారిత్రాత్మక తీర్పంటూ సంతోష్ ట్వీట్
హైదరాబాద్ : ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఓ తీర్పు బిఆర్‌ఎస్ పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్‌ను ఆకర్షిం చింది. ఈ వార్తకు సంబంధించిన క్లిప్పింగ్‌ను తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా పోస్ట్ చేసిన సంతోష్ ఇది చారిత్రాత్మక తీర్పు అని పేర్కొన్నారు. ఢిల్లీ హైకోర్టు వినూత్న తీర్పు ఇచ్చింది. 2017లో హోలీ సందర్భంగా గొడవకు కారణమైన వ్యక్తికి ఢిల్లీ కోర్టు ఆసక్తికరమైన శిక్ష విధించింది. 10 మొక్కలు నాటి 10 ఏళ్ల పాటు సంరంక్షించాలని న్యాయస్థానం ఆదేశించింది. ప్రతి ఏడాది ఆ మొక్కల స్టేట్‌స్ రిపోర్ట్ సమర్పించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. పార్టీలు కాంప్రమైజ్ కావడంతో ఎఫ్‌ఐఆర్‌ను కొట్టి వేసింది. ఇలాంటి అద్భుతమైన తీర్పు ఇచ్చిన జడ్జికి అభినందనలు అంటూ సంతోష్ కుమార్ ట్వీట్ చేశారు. ఢిల్లీ హైకోర్టు తీర్పును సంతోష్ కుమార్ స్వాగతించారు.
The Delhi High Court has delivered a unique judgment in a case directing the accused in a 2017 Holi altercation case to plant 10 indigenous trees each in the vicinity of their residence, in consultation with the IO. FIR quashed after parties compromised. Kudos to the Honble judge… pic.twitter.com/xV5hXSC6cA
— Santosh Kumar J (@SantoshKumarBRS) June 20, 2023