హైదరాబాద్ : ప్రపంచ నగరాలను తలదన్నేలా హైదరాబాద్ అభివృద్ధిలో దూసుకుపోతోంది. అదే సమయంలో హైదరాబాద్ జనాభా కూడా ఊహించని స్థాయిలో పెరుగుతోంది. పెరుగుతున్న జనాభాకి అవసరమైన మౌలిక వసతుల కల్పన ప్రభుత్వానికి కత్తిమీద సామే. కానీ సిఎం కెసిఆర్ ముందుచూపుతో హైదరాబాద్ వాసుల అవసరాలకు తగ్గ ప్రణాళికలు సిద్ధం చేశారు. ముఖ్యంగా తాగునీటి అవసరాలకోసం ఇప్పుడు చేపట్టిన ప్రాజెక్ట్ లు 2050ని దృష్టిలో ఉంచుకుని పూర్తి చేస్తున్నారు. అంటే 2050నాటికి హైదరాబాద్‌లో పెరగబోయే జనాభాకు తగ్గట్టుగా నీటి లభ్యతకోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. 2024నాటికి సుంకిశాల పూర్తయితే 2050 వరకు హైదరాబాద్ మంచినీటికి ఎలాంటి ఢోకా ఉండదు.
హైదరాబాద్ 2050 సంవత్సరం వరకు పెరుగుతున్న తాగునీటి అవసరాలను తీర్చడానికి ప్రభుత్వం పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతోందని మంత్రి కెటిఆర్ ట్వీట్ చేశారు. హైదరాబాద్ మెట్రో నీటి సరఫరా, మురుగునీటి బోర్డు సుంకిశాల వద్ద కృష్ణా నీటి సరఫరా యొక్క మూడు దశల సామ ర్థ్యాన్ని పెంచుతోందని వెల్లడించారు. 2024 వేసవి నాటికి పూర్తయ్యే ఈ ప్రాజెక్ట్ కోసం రూ.2,215 కోట్లు ఖర్చు చేస్తున్నామని స్పష్టం చేశారు.
Some work in progress pictures of the site at Sunkishala#Hyderabad #HMWSSB https://t.co/QnOW2pyj6g pic.twitter.com/il0UoQCadi
— KTR (@KTRBRS) June 20, 2023