Thursday, November 14, 2024

ఎక్సైజ్ నిబంధనలకు తూట్లు

- Advertisement -
- Advertisement -

కాళేశ్వరం: భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలంలోని కాళేశ్వరంలో ప్రభుత్వం ద్వారా రెండు అనుమతి పొందిన వైన్స్ షాపులు ఉన్నాయి. అయితే తెలంగాణ వైన్స్ (జినెం 27) మరొకటి శ్రీ కాళేశ్వర ముక్తిశ్వర వైన్స్(జినెం26) గల రెండు షాపులు ఎలాంటి ఎక్సైజ్ నిబంధనలు పాటించకుండా నిబంధనలకు తూట్లు పొడిచి అమ్మకాలు జరుపుతున్నారు.

అధిక ధరలకు మద్యాన్ని విక్రయించడం, అలాగే రెండు సిండికేట్‌గా మారి ఒక షాపులోని మద్యాన్ని, అలాగే అమ్మిన మద్యాన్ని సరైన రికార్డులు రాయకపోవడం, అలాగే వైన్‌షాప్ దగ్గర ఉండాల్సిన సిసి కెమెరాలు లేకపోవడం, ఉన్నా గాని అవి సరిగ్గా పనిచేయకపోవడం వంటి షాపులో అమ్మె వారికి లైఫ్ లైసెన్స్ ఉండాల్సి ఉండగా అందులో పనిచేసే ఇద్దరికి మాత్రమే లైసెన్స్ ఉండడం మిగతా వారికి లైసెన్స్ లేకపోవడం వంటి నిబంధనలు పట్టించుకోకుండా ఇష్టానుసారంగా విక్రయాలు చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ఇలా సిండికేట్‌గా మారిన రెండు షాపుల్లో తెలంగాణ వైన్స్‌లో జినెం 27 గల వైన్‌షాపులో ఒక ప్రత్యేక గది ఏర్పాటుచేసి అందులో కింగ్‌ఫిషర్ బీర్లు, లైట్, స్ట్రాంగ్, అలాగే ఆఫీసర్ ఛాయిస్, ఇంప్రెయిర్ బ్లూ వంటి మద్యం బ్రాండ్లను ఈ రెండు షాపుల్లో యజమానులు ఈ బ్రాండ్లను మందుబాబులకు అమ్మకుండా వాటిని బెల్టుషాపులకు తరలిస్తున్నారు.

తెలంగాణ వైన్స్ బెల్టు కోసం ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన గది నుండి కాళేశ్వరం గ్రామంలోని కొన్ని బెల్టుషాపులకు మరికొన్ని పలుగుల, కన్నేపల్లి, మదులపల్లి, అన్నారం ప్రాంతాలకు విచ్చలవిడిగా సరఫరా చేస్తున్నారు. అలాగే ఇసుక క్వారీల వద్ద కూడా ఏర్పాటుచేసిన షాపులోకి వైన్స్ నుండి మద్యాన్ని పంపించడం, వాటిని లారీ డ్రైవర్ల మద్యం సేవించడంతో మద్యం మత్తులో ప్రమాదాలు జరుగుతున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికైన విచ్చలవిడి మద్యం విక్రయాలను ఎక్సైజ్ అధికారులు అరికట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News