Monday, December 23, 2024

ముడుమాల్‌కు యునెస్కో గుర్తింపునకు కృషి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : సిఎం కృషి వల్లే రామప్ప దేవాలయంకు యునెస్కో గుర్తింపు లభించిందని పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. నారాయణపేట జిల్లా లోని ముడుమాల్ గ్రామంలో యునెస్కో స్థాయి ప్రపంచ వారసత్వ గుర్తింపు పొందేవి ఎన్నో ఉన్నాయన్నారు ముఖ్యంగా ముడుమాల్ లో ఉన్న పురాతన చారిత్రక గుర్తింపు ఉన్న అంతరిక్ష, వాతావరణ మార్పుల కేంద్రం కు యునెస్కో అవార్డు కోసం ఈ మేరకు ప్రపంచ వారసత్వ సంపద కట్టడాల గుర్తింపు జాబితాకు పంపేందుకు అవసరమైన డాక్యుమెంటేషన్‌ను సిద్ధం చేస్తున్నామన్నారు.

వారసత్వ సంపద పరిరక్షణ సాంకేతిక సహకారం పై తెలంగాణ హెరిటేజ్ శాఖ దక్కన్ హెరిటేజ్ అకాడమీ ట్రస్టుల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ సందర్భంగా ఒప్పంద పత్రాలను ఈ సందర్బంగా మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్‌లో వారికి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో యునెస్కో ప్రపంచ స్థాయి గుర్తింపు లభించే హెరిటేజ్ సైట్ లు ఎన్నో ఉన్నాయని అయినా ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో ఉన్న చారిత్రక పురావస్తు కట్టడాలపై గత పాలకులు నిర్లక్ష్యం వహించారని అన్నారు.

తెలంగాణ రాష్ట్రం లో ఎంతో పురాతన చరిత్ర, కట్టడాలు, చారిత్రక వారసత్వ సంపద ఉన్నాయని అంటూ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కృషి వల్ల రామప్ప దేవాలయం కు యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు లభించిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న చారిత్రక, పురాతన చరిత్ర, చారిత్రక వారసత్వ సంపదగా యూనేస్కో గుర్తింపు పొందడానికి ఎన్నో కట్టడాలు ఉన్నాయన్నారు. యునెస్కో గుర్తింపు కోసం నారాయణ పేట జిల్లా ముడుమాల్ గ్రామంను పురావస్తు కేంద్రంగా భావిస్తారని, ఎప్పుడో అదిమనవుని కాలం నుండి అంతరిక్ష పరిశోధన, వాతావరణ మార్పులను తెలుసుకోవడానికి ఈ చారిత్రక కేంద్రంకు ఎంతో పేరు ఉందని చరిత్ర పరిశోధకులు చెబుతారన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ గారి సహకారంతో తెలంగాణ రాష్ట్రం లో ఉన్నా చరిత్ర, వారసత్వ సంపద, కట్టడాలు చరిత్రా వెలికితీయడానికి, యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద కట్టడాల గుర్తింపు కోసం విశేష కృషి చేస్తున్నామన్నారు. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గా గుర్తింపు కోసం అవసరమైన డాక్యుమెంటేషన్ పరిరక్షణకు, సాంకేతిక సహాయం అందించడం కోసం తెలంగాణ హెరిటేజ్ శాఖ – దక్కన్ హెరిటేజ్ అకాడమి ట్రస్ట్ చైర్మన్ వేద కుమార్ ల మధ్య ఎంఓయూ కుదుర్చుకున్నట్లు తెలిపారు. ఈ సంధర్బంగా ఒప్పింద పత్రాలను డక్కన్ హెరిటేజ్ అకాడమీ ట్రస్టు ప్రతినిధులకు ఆయన అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ హెరిటేజ్ శాఖ డిప్యూటీ డైరెక్టర్ రాములు నాయక్, హెరిటేజ్ అకాడమీ ట్రస్టు ప్రతినిధులు కట్ట ప్రభాకర్ ప్రొఫెసర్ కెపి రావు లు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News