- Advertisement -
న్యూఢిల్లీ : ఆర్‌బిఐ(భారతీయ రిజర్వు బ్యాంక్) డిప్యూటీ గవర్నర్‌గా స్వామినాథన్ జానకీరామన్ నియమితులయ్యారు. ఆయన మూడేళ్ల పాటు పదవిలో కొనసాగనున్నారు. మంగళవారం జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం, జానకీరామన్ పేరును కేబినెట్ నియామకాల కమిటీ ఆమోదం తెలిపింది. జానకీరామన్ ప్రస్తుతం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బిఐ) మేనేజింగ్ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు.
- Advertisement -