Monday, December 23, 2024

పేదలకు నాణ్యమైన విద్యను అందించడమే లక్షం : హోంమంత్రి

- Advertisement -
- Advertisement -

ముషీరాబాద్: రాష్ట్రంలో పేద విద్యార్థులకు నాణ్యమైన వి ద్యను అందించడమే తెలంగాణ ప్రభుత్వ లక్షమని పలువురు వక్తలు పేర్కొన్నారు. ఇంట్లో ఆడపిల్ల చది వితే ఆ కుటుంబమే అభివృద్ది చెందుతోందని అన్నారు. తెలంగాణ రాష్ట ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ముషీరాబాద్ నియోజకవర్గ విద్యా దినోత్సవాలు బాగ్‌లింగంపల్లి శ్రీరామ్ నగర్ మైనార్టీ గురుకుల బాలికల పాఠశాలలో మంగళవారం సంబురాలు జరిగాయి. కార్యక్రమాని కి ముఖ్య అతిథిగా రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్యే ముఠా గోపాల్, జీహెచ్‌ఎంసీ మాజీ స్టాండింగ్ కమిటీ సభ్యులు వి.శ్రీని వాస్ రెడ్డి, బిఆర్‌ఎస్ రాష్ట్ర యువజన నాయకులు ముఠా జైసింహ, జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ పవన్ కుమార్‌లు హజరయ్యారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ఆవిర్భావం కంటే ఈ ప్రాంతంలో అభివృద్ది శూన్యం అని అన్నారు. రాష్ట్ర సాధన తర్వాత పేద పిల్ల లకు ఉచితంగా చదువు అందించాలనే ఉద్దేశ్యంతోనే సీఎం కేసీఆర్ రెసిడెన్సియల్ స్కూళ్ళను ఏర్పాటు చేశారన్నారు. రా ష్ట్రంలో 250 మైనార్టీ గురు కుల పాఠశాలలు ఏర్పాటు చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతోందన్నారు. అనంతరం మైనార్టీ గురుకుల పాఠశాల లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థినీలకు హోంమంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్యే ముఠా గోపాల్‌లు బహుమతులను అందజేశారు. డిప్యూటీ ఈవో చిరంజీవి అధ్యక్షత వహించగా, మైనార్టీ బాలికల గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ వాణి శ్రీ, బిఆర్‌ఎస్ రాంనగర్ డివిజన్ అధ్యక్షులు రావుల పాటి మోజస్, ప్రధానకార్య దర్శి మన్నె దామోదర్ రెడ్డి, సిరిగిరి కిరణ్, సిరిగిరి శ్యామ్, ముచ్చకుర్తి ప్రభాకర్, సోమన్, కల్పన, కార్తీక్, శంకర్ ముదిరాజ్, పాఠశాల ఉపాధ్యా యులు అఫ్రీన్, భవాని, సోనిక, ఆస్మ, రాధిక, హిమబిందు, నాగమణి, సరళ, సంతోషి, స్రవంతి పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News