Thursday, November 14, 2024

ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ బడులు

- Advertisement -
- Advertisement -

మఇల్లంతకుంట:ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పా ఠశాలలో మౌళిక వసతులు, విద్య ఏర్పాట్లు చేస్తున్నామని తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక శాఖ చైర్మన్ రసమయి బాలకిషన్ అన్నారు. మంగళవారం తె లంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా మన ఊరు మన బడి కార్యక్రమంలో నూతన హంగులతో నిర్మించిన ప్రభుత్వ మోడల్ స్కూల్ ను ఆయన ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ సమైఖ్య రాష్ట్రంలో సర్కారు బడులు పెచ్చులు ఉడి, శిథిలావస్తకు చేరుకుంటే..కొట్లాడి తెచ్చుకున్న మన రాష్ట్రంలో కేసిఆర్ నేతృత్వంలో ప్రభుత్వ బడులకు నూతన శోభ వస్తుందన్నారు. మన ఊరు మన బడి కార్యక్రమమంలో భాగంగా పాఠశాలలో మౌళిక వసతులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. దేశంలో ఎక్కువ గురుకుల విద్యాలయాలు తెలంగాణలో నే ఉన్నాయన్నారు.

అనంతరం విద్యార్థులకు పుస్తకాలు, దుస్తులను అందజేశారు. పిల్లలతో కలసి రాగిజావ తాగి సంతోషం వ్యక్తం చేశారు. వివొఎల సమస్యలను త్వరిత గతిన పరిష్కరించాలని వివోఎలు ఎమ్మెల్యేను కలిసి విన్నవించారు. విదుల్లో చేరుతున్నామని ఎ మ్మెల్యేకు తెలిపారు. బిఆర్‌ఎస్ శ్రేణులు ఎమ్మెల్యేకు శాలువాతో సత్కరించి, సన్మాణం చేశారు. జడ్పీవైస్ చైర్మన్ సిద్దంవేణు, ఎంపిపి వుట్కూరి వెంకటరమణారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ సంజీవ్, స ర్పంచ్ కూనబోయిన భాగ్యలక్ష్మీబాలరాజు, ఎంపిటిసి వొగ్గు నర్సయ్య, ఎం పిడిఓ మీర్జా, ప్రధానోపాధ్యాయుడు మహేష్‌చంద్ర, వార్డు సభ్యులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News