Friday, November 22, 2024

తెలంగాణలో గంగా జమున తెహజీబ్

- Advertisement -
- Advertisement -

లౌకిక స్ఫూర్తి ప్రదర్శిస్తున్న కెసిఆర్ ప్రభుత్వం
నేడు తెలంగాణ ఆధ్యాత్మిక దినోత్సవం

మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలను పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా ఆధ్యాత్మిక దినోత్సవాన్ని నిర్వహిస్తున్నది. మనిషి తనలోకి తాను పయనించడానికి, జీవిత పరమార్థం తెలుసుకోవడానికి ఆధ్మాత్మికతను మిం చిన మరో మార్గం లేదు. తెలంగాణ ప్రభుత్వం ఆది నుండి అన్ని మతాలకు సమ ప్రాధాన్యతనిస్తూ లౌకిక స్ఫూర్తిని ప్రదర్శిస్తున్నది.

‘భిన్నత్వంలో ఏకత్వమే’ ఈ దేశానికి బ లం అని నమ్మే సిఎం కెసిఆర్ ఆ దిశగా అన్ని మతాల భక్తి, ఆధ్యాత్మిక క్షేత్రాల పురోగతికి చేయూతనిస్తున్నారు. తద్వా రా తెలంగాణ రాష్ట్రంలో ‘గంగా జమునా తెహజీబ్’ వర్ధిల్లుతున్నది. భిన్న మతాల భక్తి, ఆధ్యాత్మక రంగాల వైభవాని కి తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్యాచరణ వేదహిత-వేద పాఠశాల సాంప్రదాయ విద్యకు ఆదరణ, గౌర వం కరువవుతున్న నేపథ్యంలో తెలంగాణలోని వేద పాఠశాలలకు ఆలంబనగా రూ.2.00 లక్షలు ఆర్ధిక సహాయం అందించే పథకం. అర్హత ఉన్న వేద పాఠశాలలు ఆన్‌లైన్ , ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ పథకం ద్వారా 32 వేద పాఠశాలల లబ్ది పొందగా, రూ. 59,50,000 లను ప్రభుత్వం ఖర్చు చేసింది. తెలంగాణ ప్రభుత్వం ప్రత్యక్ష చారిటబుల్ ట్రస్ట్ వారి ఈ ఆశయం మేరకు నాగోల్ లో ఏర్పరచిన సం ప్రదాయ పాఠశాలకు సంవత్సరానికి 3.00 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేయుటకు ఆమోదం తెలిపింది. ఈ పాఠశాలలో సంప్రదాయ విద్యతో పాటు సాధారణ విద్య కూడా నేర్పిస్తున్నారు. ఈ పథకం ద్వారా మే 2023 వరకు 100 మంది విద్యార్థినులు లబ్ది పొందారు. ప్రభుత్వం రూ. 12 లక్షల ను ఖర్చు చేసింది. తెలంగాణ బ్రాహ్మ ణ నిరుద్యో గ యువతకు ప్రభుత్వ ఉద్యోగాల కొరకు పోటీ పరీక్షల ని మిత్తం ఆర్థిక సహాయం అందించే పథకం తెలంగాణ బ్రా హ్మణ సంక్షేమ పరిషత్తు ఉద్యోగార్థులైన బ్రాహ్మణ నిరుద్యోగులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు నిర్వహించే పోటీ పరీక్షలకు కోచింగ్, స్టడీ మెటీరియల్ కొరకు ఆర్ధిక సహాయం అందిస్తారు.

వివిధ పోటీ పరీక్షలకు హాజరయ్యే పేద నిరుద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 12 బి. సి స్టడీ సెంటర్లలో కోచింగ్ తీసుకొనవచ్చును. ఈ పథకం ద్వారా 2 జూన్ 2023 నాటికి 89 మంది లబ్ది పొందారు. తెలంగాణాలోని సామజిక సేవాదృక్పథం వున్న దాతల నుంచి తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తు విరాళాలు స్వీకరించి వాటిని తిరిగి బ్రాహ్మణుల సంక్షేమం కోసం వినియోగిస్తుంది. ఈ నిధికి ప్రభుత్వం కూడా కొంత సహకరిస్తున్నది. పాలు, బెల్లంతో కలిపిన వండిన అన్నాన్ని రాగి లేదా ఇత్తడి లేదా మట్టి కుండలలో పెట్టి అమ్మవారికి సమర్పిస్తారు. ఆ కుండలను పసుపు,కుంకుమ, వేప మండలతో అలంకరిస్తారు.

కొన్నిచోట్ల ఈ కుండల పై దీపాన్ని కూడా వెలిగిస్తారు. ఇలా అలంకరించిన కుండనే బోనం అంటారు. బోనాల పండుగ ప్రతి సంవత్సరం ఆషాడమాసంలో సుమారు పదహారు రోజులు జరుగుతుంది. ఈ ఉత్సవం ముందుగా గోల్కొండలో కొలువై ఉన్న మహంకాళీ దేవాలయంలో ప్రారంభమై, సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహంకాళి దేవాలయం, హైదరాబాద్ పాతబస్తీలోని ‘షాలిబండ’లో కొలువై ఉన్న అక్కన-మాదన్న మహంకాళీ దేవాయం, ‘లాల్‌దర్వాజ’ లోని మహాంకాళీ అమ్మవారి దేవాలయం మొదలైన పలు ప్రధాన దేవాలయాలలో కనుల పండుగగా జరుగుతుంది. 2014 లో ప్రభుత్వం బోనాలను రాష్ట్ర పండుగగా ప్రకటించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News