- Advertisement -
హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఈనెల 22న బిజిబిజీగా గడపనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ముఖ్య అతిధిగా పాల్గొనున్నారు. ఉదయం కొల్లూరులోని డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళను ప్రారంభించనున్నారు. ఆ తరువాత శంకర్‌పల్లిలోని మేధా కోచ్ ఫ్యాక్టరీని ప్రారంభిస్తారు. ఆ తర్వాత పటాన్‌చెరూలో నిర్మాణాలు పూర్తి చేసుకొన్న మెడికల్ కాలేజీని ప్రారంభించనున్నారు. సాయంత్రానికి సచివాలయం ఎదురుగా లుంబినీ పార్కు పక్కనే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన అమరవీరుల స్థూపం అమర్‌జ్యోతిని ప్రారంభించనున్నారు. ఈ భారీ షెడ్యూలుకు తగినట్లుగా అధికారులు, పోలీస్‌శాఖ తగిన ఏర్పాట్లు చేసింది.
- Advertisement -