న్యూస్ డెస్క్: తనతోపాటు కళాశాలలో చదువుకున్న మహిళతో ప్రేమలో పడిన ఒక మహిళ తాంత్రికుడి సాయంతో ఆ మహిళను హత్య చేసింది. తాంత్రికుడిడితోపాటు ా మహిళను కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఉత్తర్ ప్రదేశ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.
లింగమార్పిడి చేస్తానని నమ్మబలికి షాజహాన్‌పూర్‌కు చెందిన పేనమ్ కుమారీ అనే మహిళను రాం నివాస్ అనే తాంత్రికుడు హత్య చేసినట్లు షాజహాన్‌పూర్ ఎఎస్‌పి సుధీర్ జైశ్వాల్ బుధవారం తెలిపారు. లఖింపూర ఖేరీలో బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్(బిఇడి) డిగ్రీ చదువుతున్న సమయంలో పూనమ్ కుమారికి ప్రీతి సాగర్ అనే తన సహ విద్యార్థినితో పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారింది. వారిద్దరూ కలసి జీవించాలని నిర్ణయించుకున్నారు. అయితే ఇద్దరు మహిళలు పెళ్లి చేసుకోవడాన్ని సమాజం హర్షించదని భయపడిన ఆ రెండు కుటుంబాల పెద్దలు వీరి సంబంధాన్ని వ్యతిరేకించారు.
ఇదిలా ఉండగా&తాంత్రికుడు రాం నివాస్‌కు ప్రీతి సాగర్ తల్లితో పరిచయం ఉంది. తన తాంత్రిక విద్య ద్వారా పూనమ్ కుమారికి లింగ మార్పిడి చేస్తానని, దీని వల్ల ప్రీతి సాగర్‌ను పెళ్లి చేసుకోవడానికి ఇబ్బంది తొలగిపోతుందని అతను ప్రీతి తల్లిని నమ్మించాడు. ఏప్రిల్ 18న పూనమ్ కుమారిని లఖింపూర్ ఖేరీరి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక ప్రాంతానికి తాంత్రికుడు రప్పించాడు. ఆ రోజు నుంచి తన సోదరి కనపడడం లేదని ఏప్రిల్ 26న పూనమ్ కుమారి సోదరుడు పర్వీందర్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
పోలీసులు బాధితురాలి ఫోన్ కాల్స్ వివరాలను పరిశీలించగా ప్రీతి సాగర్‌తో సుదీర్ఘంగా అనేక సార్లు మాట్లాడినట్లు బయటపడింది. పోలీసులు ప్రీతి సాగర్‌ను ప్రశ్నించగా తాంత్రికుడి గురించి చెప్పింది. వెంటనే తాంత్రికుడు రాం నివాస్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్న ప్రశ్నించారు. లింగ మార్పిడి చేసేందుకు పూజ చేయాలని చెప్పి పూనమ్ కుమారిని తానే ఒక నిర్జన ప్రదేశానికి పిలిపించినట్లు తాంత్రికుడు ఒప్పుకున్నాడు. ఆమెను గొతునులిమి చంపివేసి శవాన్ని గోమతి నది ఒడ్డున అటవీ ప్రాంతంలో వదిలిపెట్టి పరారైనట్లు అతను తెలిపాడు.
ప్రీతి సాగర్ ఇంట్లో పోలీసులకు 11 ఎముకలు లభించాయి. వాటిని ఫోరెన్సిక్ పరీక్ష కోసం పోలీసులు పంపించారు. తన సోదరి పూనమ్ కుమారిని ప్రీతి సాగర్, ఆమె తల్లి ఊర్మిల, తాంత్రికుడు రాం నివాస్ హత్య చేసినట్లు కుమార్ తన ఎఫ్‌ఐఆర్‌లో ఆరోపించాడు. తాంత్రికుడితోపాటు ప్రీతి సాగర్‌ని కూడా అరెస్టు చేసిన పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.