Friday, December 20, 2024

మంత్రిగా షబ్బీర్ అలీ అనేక అభివృద్ధి పనులు చేశారు

- Advertisement -
- Advertisement -

సదాశివనగర్ : కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మంత్రిగా ఉన్న షబ్బీర్ అలీ అనేక అభివృద్ధ్ది పనులు చేశారని పిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వడ్డేపల్లి సుభాష్ రెడ్డి అన్నారు. బుధవారం సదాశివనగర్ మండలం భూంపల్లి గ్రామ స్టేజీ వద్ద విద్యుత్ సబ్ స్టేషన్ ముందు మాజి మంత్రి షబ్బీర్ అలీ చిత్ర పటానికి క్షీరాభిశేకం చేశారు.

ఈ సందర్భంగా ఆయన మట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైస్ రాజశేఖర్ రెడ్డి సహకారంతో ప్రాణాహిత చేవెళ్ల ప్రాజెక్ట్ నిర్మాణం కోసం షబ్బీర్ అలీ కృషి చేశారని అన్నారు. దీని కోసం భూపంల్లి గ్రామ స్టేజీ వద్ద 132/33 కేవి విద్యుత్ సబ్ స్టేషన్ తీసుకొచ్చారని తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండ ల ప్రధాన కార్యదర్శి కాటిపల్లి జైపాల్ రెడ్డి, ఉపాధ్యక్షుడు అశోక్ రెడ్డి, సంతోష్ పాటిల్, యూత్ అధ్యక్షుడు కోతి లింగారెడ్డి, తిర్మన్‌పల్లి సర్పంచ్ ముడుపు బాల్‌రెడ్డి, ఎస్టీ అధ్యక్షుడితో పాటు ఆయా మండలాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News