Friday, January 10, 2025

ఆలయాల నిర్మాణంలో ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ

- Advertisement -
- Advertisement -
  • ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి

పటాన్ చెరు: దేవాలయాలు, మసిదులు, ప్రార్థనా మందిరాల నిర్మాణంలో సిఎం కెసిఆర్ నాయకత్వంలోని బిఆర్‌ఎస్ ప్రత్యేక శ్రద్ధ పెట్టిందని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం 20వ రోజు దేవాలయాల్లో ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ కెసిఆర్ నాయకత్వంలోని బిఆర్‌ఎస్ ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్ర అన్నిరంగాల్లో అభివృద్ధి సాధించిందన్నారు. అన్నివర్గాల సంక్షేమం కోరుతూ పాలన సాగిస్తున్న ముఖ్య మంత్రికి తెలంగాణ ప్రజల అండదండలతో పాటు దేశ వ్యాప్తంగా ప్రజల అదరన ఉందన్నారు. ముచ్చటగా మూడవ సారి కెసిఆర్ నాయకత్వంలోని బిఆర్‌ఎస్ అధికారంలోకి రానుందన్నారు. పటాన్‌చెరు పట్టణంలో నిర్మించబోతున్న మల్టి స్పెషాల్టీ ఆసుపత్రితో స్థానిక ప్రజలకు మంచి వైద్యం అందనుందన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News