Monday, December 23, 2024

ఆధ్యాత్మిక కార్యక్రమాలు మెరుగైయ్యాయి

- Advertisement -
- Advertisement -

మహబూబాబాద్ జిల్లా: తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం జిల్లా పరిధిలోని కురవి మండల కేంద్రంలోని ప్రసిద్ధ్ద పుణ్యక్షేత్రం శ్రీ వీరభద్రస్వామి వారి ఆలయంలో ఆధ్యాత్మిక దినోత్సవ వేడుకలు అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. జిల్లా దేవాదాయశాఖ ఆధ్వర్యంలో ఆలయ పాలక కమిటీ నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా జిల్లా కలెక్టర్ కె. శశాంక హాజరైయ్యారు. ఈ సందర్భంగా ఆలయంలో తెల్లవారు జాము నుంచే ప్రాతః కాల పూజలు, అభిషేకాలు, రుద్రహోమలు, స్వామి వారికి నివేదన, ప్రసాద వితరణ కార్యక్రమాలను నిర్వహించారు.

సాయంత్రం చిందుయక్షగానం, నాధనీరాజనం, శ్రీకోదండ రామాచార్యస్వామి వారిచేత వీరభద్రుని ఉద్భవం గూర్చి ప్రవచనం గావింపచేశారు. మానుకోటకు చెందిన ప్రముఖ నృత్యగురువు ఉదయశ్రీ నేతృత్వంలోని తాండవకృష్ణ కళానిలయం కళాకారులచేత కూచిపూడి, భరత నాట్యం కార్యక్రమాలను సాంప్రదాయరీతిలో వైభవోపేతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన కలెక్టర్‌కు ఆలయ మర్యాదలతో వేద పండితులు పూర్ణకుంభంతో మేళతళాలతో ఆహ్వానం పలికారు.

అనంతరం ఆయన కురవి వీరభద్రస్వామి, భద్రకాళీ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా ఆలయ వేద పండితులు వేదమంత్రోచ్ఛరణల నడుమ కలెక్టర్‌ను ఘనంగా సత్కరించి తీర్థప్రసాదాలను అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ శశాంక మాట్లాడుతూ.. ఆలయాల్లో మౌళిక సదుపాయాలు కల్పించడంతో పాటు దూపదీప నైవేద్యాలను సమర్పించి అన్ని ఆలయాలను పునరుద్ధరించే ఆద్యాత్మిక కార్యక్రమాలను సిఎం కెసిఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం చేపడుతుందన్నారు.

ఆధ్యాత్మికంగా ప్రజలను భక్తి భవాన్ని పెంపొందించే కార్యక్రమాలకు ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలు చేస్తుందన్నారు. పూజారులకు గౌరవ వేతనాలను కూడా అందించి వారిని అన్ని విధాలుగా ఆదుకునేందుకు ప్రోత్సాహాన్ని అందించనుందన్నారు. ఈ కార్యక్రమంలో అర్చక బృందంతో పాటు దేవాదాయ శాఖ అధికారిని కవిత, ఆలయ ఈవో సత్యనారాయణ, అధికారులు, సిబ్బంది, ఆలయ పాలక మండలి సభ్యులు బాదే నాగయ్య, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News