Sunday, January 5, 2025

ఎంజియులో అంతర్జాతీయ యోగా దినోత్సవం

- Advertisement -
- Advertisement -

నల్గొండ : మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో బుధవారం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని స్పోరట్స్ కాంప్లెక్స్‌లో రిజిస్ట్రార్ ఆచార్య తుమ్మ కృష్ణారావు అజ్ఞాతృత్వంలో నిర్వహించారు. కార్యక్రమానికి ప్రముఖ యోగ గురువు శ్రీ శంకరయ్య ముఖ్య అతిథిగా విచ్చేసి విద్యార్థులకు అధ్యాపకులకు యోగ ఆసనాలు నేర్పించారు.

ఆసనాలు యొక్క ప్రాముఖ్యతను వ్యాధుల నివారణలో వాటి యొక్క ప్రభావాన్ని విద్యార్థులకు వివరించారు. ఈ సందర్భంగా రిజిస్ట్రార్ ఆచార్య తుమ్మ కృష్ణారావు మాట్లాడుతూ ఆరోగ్య సంరక్షణలో, వ్యక్తి నిర్మాణంలో యోగ పాత్ర వెలకట్టలేనిది, ప్రపంచానికి భారతదేశం ఇచ్చిన అమూల్యమైన కానుక అని కీర్తించారు. యోగా యొక్క విశిష్టతను గుర్తించి ఎంజీయూ స్వల్ప కాలిక యోగ కోర్సును ప్రవేశపెట్టినట్లు గుర్తు చేశారు.

విద్యార్థులు ప్రతి ఒక్కరు విధిగా వ్యాయామం యోగ ఆచరించి పూర్ణ ఆరోగ్యవంతులుగా జీవించేందుకు బాటలు వేయాలని సూచించారు. యోగ యొక్క విశిష్టతను గ్రామాల్లో తోటి సహచరులతో పంచుకొని ఆరోగ్య భారతాన్ని ఆవిష్కరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎన్‌ఎస్‌ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ మద్దిలేటి, స్పోరట్స్ బోర్డ్ డైరెక్టర్ డాక్టర్ ఉపేందర్ రెడ్డి, డాక్టర్ మచ్చేందర్,, డాక్టర్ నీలకంఠం శేఖర్, రామచంద్రు, నాగరాజు మారేష్, హరికిషన్ తదితర అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News