Thursday, December 19, 2024

యోగా జన జీవన ప్రక్రియ

- Advertisement -
- Advertisement -

న్యూయార్క్ : యోగా సార్వత్రికం, విశ్వవ్యాపితం. దీనికి కాపీరైట్లు, పేటెంట్ హక్కులు ఉండవని, రాయల్టీలు అడిగే ప్రసక్తి లేదని తెలిపారు. యోగా జీవన క్రమం , యోగా వెసులుబాట్లతో కూడుకున్నది. దీనిని సామూహికంగా జనారణ్యంలో నిర్వహించుకోవచ్చు. ఏకాంతంగా ఏ అడవిలో అయినా గదిలో అయినా తీరంలోనైనా ఆచరించవచ్చునని, గురుముఖత తెలుసుకోవచ్చు లేదా స్వయంగా గ్రహించవచ్చు, సమ్మిళితం చేసేందుకు , సహోదరత్వం పెంచేందుకు ఈ ప్రక్రియ దోహదం చేస్తుందన్నారు.

ఐరాస వేదికగా జరిగిన అంతర్జాతీయ యోగాదినోవ్సవ కార్యక్రమం నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడారు. ఇది నిజంగా సార్వత్రికం, విశ్వజనీనం, ఘననీయం అన్నారు. వర్గభేదాలు, లింగవ్యత్యాసాలు, విశ్వాసాలకు అతీతం అయినదని , సంస్కృతులు సంప్రదాయలు భిన్నమైన సమిష్టిరీతిలో పాటించేందుకు వీలుండే సులువైన జీవన విధానం అని తెలిపారు. ప్రధాని యోగా దినోత్సవ సందేశాన్నివివిధ దేశాల దౌత్యవేత్తలతో పాటు 180 దేశాల ప్రముఖులు ఇక్కడికి వచ్చి ఆలకించారు.

ప్రపంచ దేశాల ప్రాతినిధ్య సంస్థ అయిన ఐక్యరాజ్య సమితి కార్యాలయం ఆవరణ వేదికగా న్యూయార్క్‌లో బుధవారం అంతర్జాతీయ యోగా దినోత్సవం జరిగింది. భారత ప్రధాని నరేంద్ర మోడీ తమ రెండు రోజుల అమెరికా అధికారిక పర్యటనను ఇక్కడి యోగా దినోత్సవంలో ప్రధానంగా పాల్గొని ప్రారంభించారు. వేలాది మంది అంకితభావంతో మనసు తనువు లయలీనంగా యోగాను ఆచరించారు. ఈ క్రమంలో ప్రధాని మోడీ యోగా పాటించారు. ఐరాస భవనం ఉత్తరవైపు లాన్స్‌లో కార్యక్రమం జరిగింది.

శాస్త్ర సాంకేతిక రంగాలు, కళలు, వినోదాత్మక వేదికలకు చెందిన ప్రముఖులు , దౌత్యవేత్తలు , విద్యావేత్తలు, టెక్నోక్రాట్లు, రాజకీయ నాయకులు, న్యూయార్క్ మేయర్ ఎరిక్ ఆడమ్స్, j మూడుసార్లు గ్రామీ విజేత రికీ కెజ్, సింగర్ ఫల్గుని షా, నటులు రిచర్డ్ గేరే, హీరోయిన్ ప్రియాంక చోప్రా, ఐరాసకు చెందిన పలువురు అధికారులు ఇందులో తాము సైతం అంటూ పాల్గొన్నారు. ఒక్కరోజు క్రితం ప్రధాని మోడీ న్యూఢిల్లీ నుంచి న్యూయార్క్‌కు చేరుకున్నారు. ఇక్కడ ఆయనకు ప్రవాస భారతీయుల నుంచి సాదర స్వాగతం లభించింది. తరువాత ఆయన స్థానిక ప్యాలెస్ హోటల్‌కు వెళ్లి రాత్రి అక్కడ బస చేశారు. న్యూయార్క్ నుంచి ప్రధాని మోడీ వాషింగ్టన్ డిసికి వెళ్లుతారు. అక్కడ అమెరికా అధ్యక్షులు బైడెన్‌తో చర్చలు జరుపుతారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News