Thursday, December 19, 2024

అమెరికా ప్రముఖులతో మోడీ భేటీ

- Advertisement -
- Advertisement -

న్యూయార్క్ : అమెరికా పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ న్యూయార్క్‌లో పలువురు ప్రముఖులను కలుసుకున్నారు. వీరిలో పలు రంగాలకు చెందిన విశిష్టులు ఉన్నారు. అమెరికాకు చెందిన ఆలోచనాపరులను కలుసుకుని వారితో భారతదేశ ప్రగతి పథం గురించి చర్చించారు. ఈ క్రమంలో వారి సహకారాన్ని అభ్యర్థించారు. ఈ క్రమంలో ప్రధాని కలుసుకున్నారు. వీరిలో అమెరికా ప్రముఖ ఆర్థికవేత్త ప్రొఫెసర్ పాల్‌రోమెర్, హడ్గె ఫండ్ సహ వ్యవస్థాపకులు, ఇన్వెస్టర్ బ్రిడ్జ్‌వాటర్ అసోసియెట్స్‌కు కెదిన రే డెలియో ఇతరులను కలిశారు.

భారతదేశం తలపెట్టిన ఆర్థిక సంస్కరణలు, ఆర్థిక పురోగతి వేగవంతం క్రమంలో తీసుకుంటున్న చర్యలను వారికి వివరించారు. ఈ దిశలో వారి ఇతోధిక పాత్ర అవసరం అన్నారు. ఇండియా డిజిటల్ ఎకనామిక్ పరిస్థితి గురించి మోడీ ప్రొఫెసర్ రోమెర్‌తో మాట్లాడారు. భారతదేశంలో సాగుతోన్న నగదురహిత ఆర్థిక లావాదేవీలు, ఈ దశలో ఆధార్ వాడకం, డిజిలాకర్ ప్రక్రియల గురించి ప్రస్తావించారు.

పారిశ్రామికవేత్త రే డెలియోను ఇండియాకు రావల్సిందిగా ఆహ్వానించారు. ప్రధాని మోడీ కలుసుకున్న వారిలో ఖగోళభౌతికశాస్త్రవేత్త నీల్ డి గ్రాసే టైసన్ , అమెరికా బౌద్ధ పండితులు , పద్మశ్రీ గ్రహీత ప్రొఫెసర్ రాబర్ట్ త్రూమన్ కూడా ఉన్నారు. ఖగోళ భౌతిక శాస్త్రవేత్త టైసన్‌తో తమ చర్చల దశలో తాను అంతరిక్ష రంగంలో అవకాశాలు , భారతదేశం తరఫున సాగే అంతరిక్ష ప్రయోగాల గురించి ప్రస్తావించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News