- కేతకిలో ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే మాణిక్‌రావు
ఝరాసంగం: తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు నిరాధరణకు గురైన దేవాలయాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నిధులను కేటాయించి అభివృద్ధి చేస్తుందని ధూపదీప నైవేథ్యం వంటి పథకాలను ప్రవేశపెట్టి అమలు దేవాలయాల్లో అనేక మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్‌రావు అన్నారు. బుధవారం రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఆధ్యాత్మిక దినోత్సవం భాగంగా ఝరాసంగం కేతకీ ఆలయం ఆయన స్థానిక నాయకులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా వారికి ఆలయ అధికారులు అర్చకులు పూర్ణపుమంతో ఘనంగా స్వాగతం పలికారు. అనంత రం పార్వతీ సమేత సంగమేశ్వర స్వామి వారి దర్శించుకొని రుద్రాభిషేకం, మహా మంగళ హారతి వంటి ప్ర త్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎ మ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మతాలకు అతీతంగా దేవాలయాలు, మసీదులు, చర్చిల అభివృద్ధికి అనేక నిధులను ప్రభుత్వం కేటాయిస్తున్నదని తెలిపారు. కెసిఆర్ నాయకత్వనా అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో జీవిస్తున్నారని అన్నారు. ధూప దీప నైవేద్యం క్రింద మంజూరైన దేవాలయాల పూజారులకు పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ దశాబ్ది ఉత్సవా ల స్పెషల్ ఆఫీసర్ జయదేవ్, సిడిసి చైర్మన్ ఉమాకాంత్ పాటిల్, కేతకి ఆలయ చైర్మన్ నీల వెంకటేశం, మండల సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు సర్పంచ్ జగదీశ్వర్, నయాబ్ తహసిల్దార్ రాజిరెడ్డి, మండల అభివృద్ధి అధికారి సుజాత, ఆలయ కా ర్యనిర్వణ అధికారి శశిధర్, జూనియర్ అసిస్టెంట్ శివకుమార్ ప్రజా ప్రతినిధులు,ఆలయ ధర్మకర్తలు,పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.