Monday, December 23, 2024

పలు పార్లమెంటు నియోజకవర్గ టిడిపి అధ్యక్షుల నియామకం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్, సికింద్రాబాద్, పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ టిడిపి అధ్యక్షుల నియామకం
ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్చార్జిలు, కో-ఆర్డినేటర్లు: టి.టిడిపి అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్
హైదరాబాద్: హైదరాబాద్, సికింద్రాబాద్, పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గాలకు టిడిపి నూతన అధ్యక్షులు నియమితులయ్యారు. తెలుగుదేశం పార్టీ సంస్థాగత నిర్మాణ ప్రక్రియలో భాగంగా మరో మూడు పార్లమెంటు నియోజకవర్గాలకు పార్టీ అధ్యక్షులను ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ నియమించారు. హైదరాబాద్ పార్లమెంటు నియోజవర్గం అధ్యక్షులుగా అలీ మస్కతిని, సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షులుగా పి.సాయిబాబాను, పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షులుగా బి.సంజయ్ కుమార్ ను నియమిస్తూ నియామక ఉత్తర్వులు జారీచేశారు.

బుధవారం ఎన్టీఆర్ భవన్లో హైదరాబాద్, సికింద్రాబాద్, పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గాల ముఖ్య నాయకులతో జ్ఞానేశ్వర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ సంస్థాగత నిర్మాణం, కార్యక్రమాల అమలు, నాయకులు పనితీరుతో పాటు ఆయా నియోజకవర్గాల వారీగా పార్టీ స్థితిగతులపై నాయకులతో చర్చించారు. ఈ సందర్భంగా పార్లమెంటు, ఇతర స్థానిక కమిటీల నియామకంపై అభిప్రాయాలు తీసుకొన్నారు. అనంతరం హైదరాబాద్, సికింద్రాబాద్, పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గాలకు పార్టీ అధ్యక్షులతో పాటు నూతన కార్యవర్గాలను కాసాని జ్ఞానేశ్వర్ నియమించారు.

హైదరాబాద్ పార్లమెంటు టీడీపీ కమిటీ నూతన కార్యవర్గం ఇదీ
అధ్యక్షులు గా అలీ మస్కతీ(చార్మినార్) ఉపాధ్యక్షులుగా రాం నారాయణ యాదవ్(గోషామహాల్), కప్ప కృష్ణ గౌడ్(యాకుత్ పుర) లక్ష్మణ్ యాదవ్(కార్వాన్), ప్రధాన కార్యదర్శులుగా నాగు నాగేష్(చాంద్రాయణగుట్ట), షఫీ షర్పన్ (యాకుత్ పుర), జోగేందర్ సింగ్( చార్మినార్) , ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా మితిలేష్ యాదవ్(గోషా మహల్), అనీస్ ఉల్ రహేమాన్ (చార్మినార్), మహమ్మద్ నసీర్(యాకుత్ పుర), శంకర్ ముదిరాజ్ (బహుదూర్ పుర), జి. వెంకట రమణ (చాంద్రాయణగుట్ట), ఎం.సురేష్(కార్వాన్)), ఒగ్గు బాలరాజు(చాంద్రాయణగుట్ట), సల్లా శైలేష్ కుమార్ (చార్మినార్), ప్రచార కార్యదర్శులుగా బి వై శ్రీకాంత్(యాకుత్ పుర), విజయ్ రాఠీ (మలక్ పేట్),నర్సింగరావు (కార్వాన్), కార్యదర్శులుగా రాజు ముదిరాజ్(గోషా మహల్), శంశుద్దీన్(బహుదూర్ పుర), వరికుప్పల యాదయ్య(యాకుత్ పుర),అహమద్ షరీఫ్ (బహుదూర్ పుర), ఇక్బాల్ జకీర్ (యాకుత్ పుర), జుబేర్ ఆముది (చార్మినార్), సత్వేందర్ పాల్ సింగ్ -టీంకు సింగ్(గోషా మహల్), జి. చంద్రశేఖర్(కార్యదర్శి), రహీం (కార్వాన్) నియమితులయ్యారు. ఇక సికింద్రాబాద్ పార్లమెంటు టీడీపీ కమిటీ నూతన కార్యవర్గంలో అధ్యక్షులుగా పి.సాయిబాబా (ముషీరాబాద్), ఉపాధ్యక్షులుగా వల్లారపు శ్రీనివాస్(సికింద్రాబాద్), ఆవుల అనిల్ (ఖైరతాబాద్), కట్టా రాములు (ముషీరాబాద్), జాకబ్(బాల నర్సింహులు) -జూబ్లీహిల్స్ ప్రమీల (జూబ్లీహిల్స్), ప్రధాన కార్యదర్శులుగా నల్లెల్ల కిశోర్ (ఖైరతాబాద్), పలుస బాలరాజు గౌడ్(ముషీరాబాద్), అధికార ప్రతినిధులుగా పెంటం రాజు (అంబర్‌పేట), కోశాధికారిగా రాం చందర్ గుప్తా నియమితులయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News