- Advertisement -
మన తెలంగాణ/హైదరాబాద్: గృహలక్ష్మి పథకం గైడ్‌లైన్స్ విడుదల చేయడం పట్ల రాష్ట్ర ఎస్‌షి అభివృద్ధి, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. సొంత స్థలం ఉన్న పేదల ఇంటి నిర్మాణానికి వందశాతం రాయితీతో 3 దశల్లో రూ. లక్ష చొప్పున రూ.3 లక్షల సాయం అందించాలని నిర్ణయం తీసుకోవడం గొప్ప నిర్ణయమని ఆయనన్నారు.
జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో నియోజకవర్గానికి 3వేల చొప్పున లబ్ధిదారుల ఎంపిక చేయడం ద్వారా నిజమైన అర్హులకు న్యాయం జరుగుతుందన్నారు. ఏ రాష్ట్రం లో లేని విధంగా మహిళల పేరు మీద ఈ సాయం అందిస్తున్నారని చెప్పారు. ఇళ్లు నిర్మించు కోలేని పేదలకు ఇది పెద్దవరం అవుతుందని మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు.
- Advertisement -