మరిపెడ: సిఎం కెసిఆర్‌ను, బిఆర్ఎస్ పార్టీని ఓడించే శక్తి ఏ పార్టీకి లేదని, ఖచ్చితంగా నూటికి నూరు శాతం మళ్లీ కెసిఆరే సిఎం, నేనే ఎమ్మెల్యే అని డోర్నకల్ ఎమ్మెల్యే డిఎస్ రెడ్యానాయక్ అన్నారు. శనివారం ఆయన మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం బీచ్రాజుపల్లి, ఉల్లేపల్లి, లూనావత్ తండా గ్రామ పంచాయితీల పరిధిలో పలు అభివృద్ధి పనులకు జిల్లా గ్రంథాలయ సంస్ధ చైర్మన్ గుడిపుడి నవీన్‌రావుతో కలిసి శంకుస్ధాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ముందుగా బీచ్రాజుపల్లి, ఎల్లారిగూడెం గ్రామాల్లో జిల్లా గ్రంథాలయ సంస్ధ చైర్మన్ గుడిపుడి నవీన్‌రావు, బిఆర్ఎస్ జిల్లా నాయకులు రామడుగు అచ్యుత్ రావు ఆధ్వర్యంలో ఎమ్మెల్యేకు బతుకమ్మలు, బోనాలు, కోలాటాలు, నృత్యాలు, డాన్స్‌లతో పూలు చల్లుకుంటూ ఘన స్వాగతం పలికారు. ఆయా గ్రామాల్లోని స్ధానిక నాయకులతో కలిసి తిరుగుతూ ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
అనంతరం బీచ్రాజుపల్లి సర్పంచ్ నాతీ కృష్ణ, ఉల్లేపల్లి సర్పంచ్ చిర్రబోయిన ప్రభాకర్, లూనావత్ తండా సర్పంచ్ లూనావత్ వీరమల్లు అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సిఎం కెసిఆర్ పాలనలో గ్రామాలు, తండాలు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నాయని, దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలా గ్రామాల అభివృద్ధి కోసం లక్షలాది రూపాయలు మంజూరు చేస్తుందన్నారు. దేశానికి పల్లెలే పట్టుగొమ్మలని, గ్రామాల సర్వతోముఖాభివృద్ధికి బిఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఇందులో భాగంగా ప్రతి గ్రామంలో సిసి రోడ్లు, మురుగు కాలువలను నిర్మించి.. ప్రజలకు కావాల్సిన కనీస మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. పాలన సౌలభ్యం కోసం తండాను గ్రామ పంచాయితీలుగా మార్చిన ఘనత సిఎం కెసిఆర్‌దేనని అన్నారు.
అమరుల త్యాగాల ఫలితంగా ఎర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమ నేత కెసిఆర్ సిఎం కావడం మన అదృష్టమన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తూ, రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. వ్యవసాయాన్ని పండుగలా మార్చిన సిఎం కెసిఆర్ రైతును రాజు చేశారని, రైతు బంధు, రైతు భీమా పథకాలతో పాటు ఆసరా పించన్లుతో ఆయా వర్గాలకు అండగా నిలిచారని వివరించారు. వ్యవసాయానికి ఉచితంగా నిరంతర విద్యుత్ ఇస్తుండటంతో పంటల సాగు పెరిగిందన్నారు. ఇలాంటి పథకాలు దేశంలో ఎక్కడా లేదన్నారు. స్వరాష్ట్రంలో అన్ని వర్గాలకు అండగా నిలిచిన ఘనత సిఎం కెసిఆర్‌కే దక్కిందన్నారు. తెలంగాణ రాకపోతే కాళేశ్వరం ప్రాజెక్టు అయ్యేదా? అక్కడి నుంచి పుష్కలంగా సాగునీరు వచ్చేవా? సంవృద్ధిగా పంటలు పండేవా? అని ప్రశ్నించారు.
భవిష్యత్ మరింత మంచిగా ఉండాలంటే సిఎం కెసిఆర్ పాలకులుగా ఉండాలన్నారు. అభివృద్ధి కోసం అన్ని విధాల కృషి చేస్తామన్నారు. ఈ జీవితం ప్రజా సేవకే అంకితమని, ప్రజల అభిమానం వెలకట్టలేనిదని, సదా ప్రజా సేవకే తన జీవితం అంకితమన్నారు. అనుక్షణం ప్రజల మధ్యనే ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం అహర్నిశలు కృషి చేస్తూ, నియోజకవర్గ అభివృద్ధే లక్షంగా పని చేస్తున్నామని తెలిపారు. ప్రజలు పనిచేసే ప్రభుత్వానికి అండగా ఉండి దీవించాలని, మరోసారి అవకాశం కల్పించాలని తెలిపారు.పేదల సంక్షేమం కోసం ఆసరా, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, కెసిఆర్ కిట్ వంటి అనేక పథకాలను బిఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తుంది కాబట్టే ఓటు అడిగే హక్కు మాకే ఉందన్నారు.
ఇంటి జాగలు ఉన్న అర్హులైన నిరుపేదలకు ఇళ్లు ఇస్తామని, అర్హులైన వారికి దళిత బంధు పథకం కింద యూనిట్లు అందజేస్తామన్నారు. విమర్శకులు ఎన్ని పిల్లిగుర్రాలు వేసిన, ఎన్ని ఆటంకాలు సృష్టించిన రెడ్యానాయకే ఎమ్మెల్యే అవుతాడని తెలిపారు. ఇక్కడ ఎమ్మెల్యేగా నిలబడేది నేనే గెలిచేది నేనేనన్నారు. ప్రజా సంక్షేమమే లక్షంగా అహర్నిశలు కృషి చేస్తున్న బిఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజలు అండగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు డిఎస్ రవిచంద్ర, ఎంపిపి గుగులోతు అరుణ రాంబాబునాయక్, జడ్పిటిసి తేజావత్ శారధా రవీందర్‌నాయక్, మున్సిపల్ చైర్పర్సన్ గుగులోతు సింధూర రవినాయక్, పిఏసిఎస్ చైర్మన్ చాపల యాదగిరిరెడ్డి, బిఆర్ఎస్ జిల్లా నాయకులు రామడుగు అచ్యుత్‌రావు, మండల పార్టీ అధ్యక్షులు సత్యనారాయణరెడ్డి,
మాజీ ఓడిసిఎంఎస్ చైర్మన్ కుడితి మహేందర్‌రెడ్డి, మాజీ ఎంపిపి గుగులోతు వెంకన్న, మాజీ జడ్పిటిసి బాల్ని మాణిక్యం, సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు తాళ్లపెల్లి శ్రీనివాస్, ఎంపిటిసిల ఫోరం అధ్యక్షులు తాళ్లపెల్లి రఘు, బిఆర్ఎస్ జిల్లా నాయకులు గుగులోతు రాంబాబునాయక్, తేజావత్ రవీందర్‌నాయక్, అయూబ్‌పాషా, ఎంపిటిసిలు భూక్య జ్యోతి రాంమూర్తినాయక్, కొమ్ము నరేష్, బిఆర్ఎస్ మండల ఉపాధ్యక్షులు నారెడ్డి సుదర్శన్‌రెడ్డి, దిగజర్ల ముఖేష్, దిగజర్ల శ్రీనివాస్, గోల్కొండ వెంకన్న, మోర వెంకన్న, వెంకటమల్లు, తహశీల్ధార్ పిల్లి రాంప్రసాద్, ఎంపిడిఓ కేలోతు ధన్సింగ్, ఎంపిఓ పూర్ణచందర్‌రెడ్డి, పిఆర్ ఏఈ శ్రీనివాస్, మిషన్ భగీరథ ఏఈ రాకేష్, ఆర్‌డబ్లూఎస్ ఏఈ విష్ణువర్ధన్, విద్యుత్ ఏఈ పావని, కార్యదర్శులు దొంతు లెనిన్, మధుకర్, దివ్య, ఉప సర్పంచ్‌లు, గ్రామ పార్టీ అధ్యక్షులు, వార్డు సభ్యులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, ఆధికారులు తదితరులు పాల్గొన్నారు.