Saturday, December 28, 2024

సిఎం కెసిఆర్ యాగఫలంతోనే తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలం

- Advertisement -
- Advertisement -

మరిపెడ: లోక కళ్యాణార్ధం ముఖ్యమంత్రి కెసిఆర్ మహా చండీ యాగ ఫలంతోనే తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా సస్యశ్యామలంగా మారిందని డోర్నకల్ ఎమ్మెల్యే డిఎస్ రెడ్యానాయక్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా బుధవారం మండలంలో బీచ్‌రాజుపల్లి, జరుపులతండా, ఉల్లేపల్లి గ్రామాల్లో ఆధ్యాత్మిక దినోత్సవ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డోర్నకల్ ఎమ్మెల్యే డిఎస్ రెడ్యానాయక్, జిల్లా గ్రంథాలయ సంస్ధ చైర్మన్ గుడిపుడి నవీన్‌రావు, ఫస్ట్‌క్లాస్ కాంట్రాక్టర్ రామడుగు అచ్యుత్‌రావు, జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు డిఎస్ రవిచంద్ర, ప్రజాప్రతినిధులు ముఖ్య అతిథులుగా హాజరై మండలంలోని బీచ్‌రాజుపల్లి గ్రామంలోని అభయాంజనేయస్వామి, జరుపులతండాలోని రామచంద్రస్వామి, ఉల్లేపల్లి గ్రామంలోని సీతారామచంద్రస్వామి ఆలయంలో అర్చకులు పాకాల సంతోష్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ కృషితోనే రాష్ట్రంలో ఆలయాలు సరికొత్త వైభవాన్ని సంతరించుకుని ఆధ్యాత్మిక కేంద్రాలుగా విరజిల్లుతున్నామని తెలిపారు. లోక కళ్యాణార్ధం సిఎం కెసిఆర్ మహా చండీయాగం నిర్వహించడం, యాగ ఫలంతోనే వల్లనే రాష్ట్రం సుభిక్షంగా సస్యశ్యామలంగా మారిందన్నారు. దేవుని దయతో సకాలంలో వర్షాలు కురిసి సంవృద్ధిగా పంటలు పండి పాడిపంటలతో ప్రజలు సుఖసంతోషాలతో జీవిందచాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి గుగులోతు అరుణ రాంబాబునాయక్, జడ్‌పిటిసి తేజావత్ శారధా రవీందర్‌నాయక్, మున్సిపల్ చైర్‌పర్సన్ గుగులోతు సింధూర రవినాయక్, పిఏసిఎస్ చైర్మన్ చాపల యాదగిరిరెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు సత్యనారాయణరెడ్డి, మాజీ ఓడిసిఎంఎస్ చైర్మన్ కుడితి మహేందర్‌రెడ్డి,

మాజీ ఎంపిపి గుగులోతు వెంకన్న, మాజీ జడ్‌పిటిసి బాల్ని మాణిక్యం, సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షులు తాళ్లపెల్లి శ్రీనివాస్, ఎంపిటిసిల ఫోరం అధ్యక్షులు తాళ్లపెల్లి రఘు, బిఆర్‌ఎస్ జిల్లా నాయకులు గుగులోతు రాంబాబునాయక్, తేజావత్ రవీందర్‌నాయక్, అయూబ్‌పాషా, ఎంపిటిసిలు భూక్య జ్యోతి రాంమూర్తినాయక్, కొమ్ము నరేష్, బిఆర్‌ఎస్ మండల ఉపాధ్యక్షులు నారెడ్డి సుదర్శన్‌రెడ్డి, సర్పంచ్‌లు నాతి కృష్ణ, చిర్రబోయిన ప్రభాకర్, దిగజర్ల ముఖేష్, దిగజర్ల శ్రీనివాస్, గోల్కొండ వెంకన్న, జరుపుల రవీందర్, వెంకన్న, జేత్యా, రెడ్యా, తహశీల్ధార్ పిల్లి రాంప్రసాద్, ఎంపిడిఓ కేలోతు ధన్‌సింగ్, ఎంపిఓ పూర్ణచందర్‌రెడ్డి, పిఆర్ ఏఈ శ్రీనివాస్, మిషన్ భగీరథ ఏఈ రాకేష్, ఆర్‌డబ్లూఎస్ ఏఈ విష్ణువర్ధన్, విద్యుత్ ఏఈ పావని, కార్యదర్శులు దొంతు లెనిన్, మధుకర్, ఉప సర్పంచ్‌లు, గ్రామ పార్టీ అధ్యక్షులు, వార్డు సభ్యులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, ఆధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News