Saturday, November 23, 2024

మైనార్టీల అభివృద్ధికి జిల్లాలోనే తూర్పు నియోజవర్గానికి అధిక నిధులు

- Advertisement -
- Advertisement -

ఖిలా వరంగల్: మైనార్టీల అభివృద్ధ్దికి జిల్లాలోనే మన తూర్పు నియోజకవర్గానికి అత్యధిక నిధులు కేటాయించి తోడ్పాటును అందించినట్లు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ తెలిపారు. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని బుధవారం ఆధ్యాత్మాక దినోత్సవం సందర్భంగా వరంగల్ హజ్రత్ మాషుక్ రబ్బానీ దర్గాలో పీఠాధిపతి నవీన్ బాబా, ఉబేద్ బాబాలతో కలిసి ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నియోజకవర్గంలో పక్కా భవనాలతో కూడిన మూడు మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేశాం. ఈద్గాలు, మసీదు, జెండా గద్దెలు, షాదీ ఖానాల అభివృద్ధికి నిధులు కేటాయించుకొని పనులు జరుగుతున్నాయన్నారు.

నియోజకవర్గంలో ఇద్దరు మైనార్టీ కార్పొరేటర్లుగా అవకాశం కల్పించి గెలుపించుకొని డిప్యూటీ మేయర్ చేసుకోవడం జరిగింది. నా శాయ శక్తులా ముస్లింలకు నిరంతరం తోడ్పాటును అందిస్తా. మసీదుల అభివృద్ధికి రూ. 7.50 కోట్లు కేటాయించడం జరిగింది. రంజాన్, ఉర్సు ఉత్సవాలను బ్రహ్మాండంగా చేసుకున్నారు. సీఎం కేసీఆర్ మొన్న ఇదే దర్గాలో ఎమ్మెల్యే నరేందర్ సరైన నాయకుడు, తన వల్లనే నియోజకవర్గంలో అన్ని వర్గాలకు న్యాయం కలుగుతుందని నవీన్‌బాబాతో తెలపడం జరిగింది. ఆ రోజు నాకు చాలా సంతోషం కలిగింది. బతికున్నంత కాలం అన్ని వర్గాల అభివృద్ధికి కృషి చేస్తా.

ప్రజల ప్రేమ ఉంటే చాలు వారి కోసం నిరంతరం పని చేస్తూనే ఉంటా. అన్ని వర్గాల ప్రజలు కలిసి కట్టుగా పనిచేద్దాం.. నియోజకవర్గ అభివృద్ధిలో భాగస్వాములవుదామన్నారు. రూ. 83.50 లక్షలతో మొన్న కేటీఆర్ చేతుల మీదుగా దర్గా అభివృద్ధికి శంకుస్థాపన చేసుకున్నాం. ఉర్సు దర్గాకు ప్రభుత్వం ద్వారా నిధులు కేటాయించడమే కాదు నా వ్యక్తిగతంగా తప్పకుండా సాయం అందిస్తానన్నారు. నా జీవితాన్ని కుటుంబాన్ని వదిలి ప్రజల కోసం నిరంతరం పనిచేస్తున్నా.

ఆ అల్లాహ్ ఆశీర్వాదంతో ప్రజలందరూ బాగుండాలన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్ మసూద్, కార్పోరేటర్లు మరుపల్ల రవి, మహ్మద్ పుర్ఖాన్, డివిజన్ అధ్యక్షుడు పూజారి విజయ్, సందీప్, జబ్బార్, జిల్లా మైనార్టీ అధికారి విక్రమ్, నాయకులు, మైనార్టీ నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News