Thursday, November 14, 2024

తెలంగాణ కోసం జీవిత కాలమంతా కృషి చేసిన వ్యక్తి జయశంకర్

- Advertisement -
- Advertisement -

హన్మకొండ టౌన్ : తెలంగాణ సిద్ధ్దాంతకర్త, మహోన్నత మానవుడు, తెలంగాణ గాంధీ ప్రొఫసర్ కొత్తపల్లి జయశంకర్ వర్ధంతి సందర్భంగా హన్మకొండ బాలసముద్రం లోని జయశంకర్ పార్క్ లో శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్, జడ్పీ చైర్మన్ డాక్టర్ సుధీర్ కుమార్ ఆయన విగ్రహం నకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా డిప్యూటీ చైర్మన్ మాట్లాడుతూ, తన జీవిత కాలమంతా తెలంగాణ కోసం విరామం ఎరుగకుండా కృషి చేసిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు.

ప్రత్యేక రాష్ట్రం కావాలని, ఏపీ ఉమ్మడి రాష్ట్రంలో తన గొంతుకను వినిపించిన యోధుడని ప్రశంసించారు. ఆయన చూపిన బాట గొప్పదన్నారు. ప్రొఫసర్ జయశంకర్ ప్రతిపాదించిన తెలంగాణ సిద్దాంతం యావత్ ప్రపంచాన్ని కదిలించిందన్నారు. ఆచార్యుడిగా, మేధావిగా, రచయితగా, వక్తగా, సిద్ధ్దాంతకర్తగా జయశంకర్ నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News