Friday, December 20, 2024

బర్త్ డే పార్టీలో బంగారం దొంగతనం చేసిందని మహిళను కొట్టి చంపారు…

- Advertisement -
- Advertisement -

లక్నో: బర్త్ డే పార్టీలో నాలుగు లక్షల రూపాయల విలువ చేసే బంగారు ఆభరణాలు దొంగతనం చేసిందని ఓ మహిళను చితకబాదడంతో ఆమె మృతి చెందిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం ఘజియాబాద్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… సమీనా అనే మహిళ తన దగ్గర బంధువు రమేష్(40), హీనా(35) అనే దంపతుల కుమారుడు పుట్టిన రోజు వేడుకలకు హాజరైంది. వేడుకలు ముగిసిన తరువాత నాలుగు లక్షల రూపాయల విలువ చేసే బంగారు ఆభరణాలు కనిపించకపోవడంతో సమీనా దొంగతనం చేసిందని అనుమానించారు.

Also Read: కూలిన ఫ్లై ఓవర్

వెంటనే ఆమెను ప్రశ్నించడంతో తాను దొంగతనం చేయలేదని తెలిపింది. రమేష్, హీనా, దంపతులు ఆమెపై దాడి చేశారు. ఆమె ఏడుపులు బయటకు వినిపించకుండా పెద్ద శబ్ధంతో మ్యూజిక్ పెట్టారు.. ఆమెపై పైపులు, కర్రలతో దాడి చేయడంతో ఆమె స్పృహ తప్పి పడిపోయింది. దెబ్బలు తాళలేక సమీనా ఘటనా స్థలంలో మృతి చెందింది. దీంతో నిందితులు మ్యూజిక్ పెద్దగా పెట్టి ఘటనా స్థలం నుంచి పారిపోయారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఎనిమిది మంది నిందితులను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నామని పోలీసులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News