Friday, December 20, 2024

టాయిలెట్ క్లీనర్ తాగి ఎంబిబిఎస్ విద్యార్థిని ఆత్మహత్య?

- Advertisement -
- Advertisement -

లక్నో: ఎంబిబిఎస్ విద్యార్థిని టాయిలెట్ క్లీనర్ తాగి ఆత్మహత్య చేసుకున్నట్టుగా ఆరోపణలు వచ్చిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం కాన్పూర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. గణేష్ శంకర్ విద్యార్థి మెమోరియల్ మెడికల్ కాలేజీలో సదరు విద్యార్థిని(23) ఎంబిబిఎస్ సెకండియర్ చదువుతోంది. జిఎస్‌విఎం కాలేజీలోహాస్టల్ వసతి ఉన్నప్పటికి ఆ విద్యార్థిని అద్దెకు రూమ్ తీసుకొని తన కుటుంబానికి దూరంగా ఉంటుంది. జూన్ 17న సదరు విద్యార్థిని టాయిలెట్ క్లీనర్ తాగడంతో ఆమెను ఎల్‌ఎల్‌ఆర్ ఆస్పత్రిలో ఇద్దరు యువకులు జాయిన్ చేశారు.

Also Read: భట్టిని కలిసిన పొంగులేటి, పిడమర్తి రవి

ఆస్పత్రిలో చేర్చిన వెంటనే ఇద్దరు యువకులు కనిపించలేదు. వైద్యులు వెంటనే ఆమెను ఐసియులో ఉంచి చికిత్స ప్రారంభించారు. అవయవాలు పని చేయకపోవడంతో చికిత్స పొందుతూ సదరు విద్యార్థి చనిపోయిందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. తన కూతురు ఆత్మహత్యపై విచారణ జరిపించాలని ఆమె తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ఆస్పత్రిలో చేర్పించిన యువకులు ఎవరు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు సమాచారం. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News