Friday, April 11, 2025

గన్ పార్క్ వద్ద ఉద్రిక్తత

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: గన్ పార్క్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బిఆర్ఎస్ వి, బిజెపి కార్పొరేటర్లు ఒకేసారి అమరుల స్థూపానికి నివాళ్లు అర్పించేందుకు వచ్చారు. ఎంతసేపు నివాళ్ళు అర్పిస్తారని, తాము నివాళ్లు అర్పించి కౌన్సిల్ కు వెళ్తామని పోలీసులతో బిజెపి కార్పొరేటర్లు వాగ్వాదానికి దిగారు. బిజెపి కార్పొరేటర్లతో బిఆర్ఎస్ వి కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. సిఎం కెసిఆర్, మోడీ డౌన్ డౌన్ అంటూ ఇరు వర్గాలు నినాదాలు చేయడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు రెండు వర్గాలను చెదరగొట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News