Sunday, December 22, 2024

ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పనితీరుపై కెసిఆర్ కామెంట్స్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సంగారెడ్డి జిల్లాలోని పటాన్ చెరులో ముఖ్యమంత్రి కెసిఆర్ రూ. 183 కోట్లతో 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి భూమిపూజ చేశారు. సంగారెడ్డి జిల్లాలోని ఒక్కో మున్సిపాలిటీకి రూ.30 కోట్లు కేటాయిస్తున్నామని కెసిఆర్ పేర్కొన్నారు. ప్రతి డివిజన్ కు రూ. 10 కోట్లు ఇస్తామని వెల్లడించారు. పటాన్ చెరు రోజురోజుకూ అభివృద్ధి చెందుతోందన్న సిఎం, పటాన్ చెరులో మహిపాల్ రెడ్డి బాగా పనిచేస్తున్నారని ప్రశంసించారు. రెవెన్యూ డివిజన్ అడుగుతున్నారు… తప్పకుండా నెరవేరుస్తామన్నారు.

పటాన్ చెరులో కాలుష్యం పెరగకుండా చర్చలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పటాన్ చెరులో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి రావడంలో రాజీవ్ శర్మ కృష్టి ఉందన్నారు. హరీశ్ రావు వచ్చాక వైద్యరంగం పరుగులు పెడుతోందన్నారు. హైదరాబాద్ నలువైపులా 5 పెద్ద ఆస్పత్రులు వస్తున్నాయని సిఎం పేర్కొన్నారు. సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రులు కెటిఆర్, హరీశ్ రావు, ఎంపిలు బిబి పటేల్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News