Monday, December 23, 2024

బెల్టుషాపులకు అడ్డాగా కాళేశ్వరం

- Advertisement -
- Advertisement -

కాళేశ్వరం: మహాదేవపూర్ మండలంలోని కాళేశ్వరం గ్రామంలో అత్యంత ప్రతిష్టగాంచిన పుణ్యక్షేత్రం ఉండడం, అనేక మంది భక్తులు రావడం జరుగుతుంది. అయితే ఇటీవల కాలంలో కాళేశ్వరం పుణ్యక్షేత్రమే కాకుండా బెల్టుషాపులకు అడ్డాగా మారిందని కొందరు ఆరోపణలు చేస్తున్నారు. గుడి బడి తేడా లేకుండానే బెల్టుషాపులు నిర్వహిస్తున్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. కాళేశ్వర ముక్తేశ్వర స్వామి అనుబంధ దేవాలయమైన దత్తాత్రేయ స్వామి దేవాలయం 20 మీటర్ల దూరంలోనే ఒక బెల్టుషాపు రాత్రి, పగలు తేడా లేకుండా నడుస్తుంది.

అంటే కాళేశ్వరంలో ఎన్ని బెల్టుషాపులు ఇలా నడుస్తున్నాయో అర్థం చేసుకోవాలి. ఇంత జరుగుతున్నా మరి ఇటు ఆలయ అధికారులు ఇటు సంబంధిత అధికారులు ఇంతవరకు అలాంటి బెల్టుషాప్‌పై చర్యలు తీసుకోకపోవడం శోచనీయం. అలాగే కాళేశ్వరంలో సుమారు 30కి పైగా బెల్టుషాపులు నడుస్తున్నాయి. గిరిజన ఆశ్రమ పాఠశాల పక్కనే ఓ బెల్టుషాపు ఉండడం అలాగే కాళేశ్వరం అంతరాష్ట్ర చెక్‌పోస్ట్ వద్ద సుమారు నాలుగు నుంచి ఐదు బెల్టుషాపులు ఉన్నాగాని గాని అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. కాళేశ్వరంలో అధికంగా బెల్టుషాపులు కావడం రాత్రి కూడా ఈ బెల్టు షాపులో మందు దొరకడంతో యువకులు మద్యానికి బానిసలవుతున్నారు.

మండలంలోని కాళేశ్వరంలో రెండు వైన్‌షాపులు సిండికేట్‌గా మారి తెలంగాణ వైన్స్ నుండి బెల్టుషాపులకు స్టిక్కరింగ్‌తో కూడిన కొన్ని బ్రాండ్లను సరఫరా చేయడం వంటి కార్యక్రమాలు చేపడుతున్నట్లు ప్రజలు ఆరోపిస్తున్నారు. అలాగే గతంలో ఈ బెల్టుషాపుల దందా గురించి, అలాగే కాళేశ్వరంలోని రెండు వైన్ షాపుల్లో జరిగే దందాల గురించి సంబంధిత అధికారులకు కాళేశ్వరం నుండి అనేకమార్లు కంప్లైంట్ చేసిన ఇంత వరకు వాటిపై చర్యలు గాని కనీసం వాటిని తనిఖీ చేసిన అధికారులు కూడా రాకపోవడం అలాగే ఇంత జరుగుతున్న పట్టించుకోకపోవడంతో మామూళ్ల మత్తులో అధికారులు జోగుతున్నారని ప్రజలు అనుకుంటున్నారు.
జోరుగా బెల్టుషాపులు: కాంగ్రెస్ ఎస్‌సి సెల్ మండలాధ్యక్షుడు నేతకారి రాజబాబు
కాళేశ్వరం పుణ్యక్షేత్రం బెల్టుషాపులకు అడ్డాగా మారింది. పగలు, రాత్రి అనే తేడా లేకుండా షాపులు అమ్మడం వలన యువకులు మద్యానికి బానిస అవుతున్నారు. ఈ బెల్టు షాపులపైన కాళేశ్వరం వైన్‌షాపుల్లో జరిగే అక్రమాలపైన సం బంధిత అధికారులకు అనేక సార్లు ఫిర్యాదు చేసినప్పటికి వాళ్లు పట్టించుకోవడం లేదు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News