Saturday, December 21, 2024

దశాబ్ది ఉత్సవాలతో పండగ వాతావరణం

- Advertisement -
- Advertisement -
  • మున్సిపల్ చైర్‌పర్సన్ ముల్లి పావని

ఘట్‌కేసర్: తెలంగాణ దశాబ్ది ఉత్సవాలతో ఇరవై రోజులుగా రాష్ట్రంలో పండగ వాతావరణ నెలకొందని మున్సిపల్ చైర్‌పర్సన్ ముల్లి పావని అన్నారు. ఘట్‌కేసర్ మున్సిపాలిటీ కార్యాలయం ఆవరణలో దశాబ్ది ఉత్సవాలలో భాగంగా గురువారం అమర వీరుల స్మారక దినోత్సవం సందర్భంగా అమరవీరుల చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఆవతరించిన తర్వాత తొమ్మిదేళ్లలో ముఖ్యమంత్రి కేసిఆర్ పాలనలో ప్రభుత్వ సాధించిన ప్రగతిని గుర్తు చేసుకుంటూ దశాబ్ది ఉత్సవాలు జరుపుకోవడం హర్షనీయమని, జూన్ 2 నుండి 22 వరకు ప్రతి రోజు రాష్ట్రంలో పండగ వాతావరణ నెలకొందని అన్నారు.

ఇలాంటి ప్రగతి ఏ ప్రభుత్వ చేయలేదని, నేడు తెలంగాణ దేశానికి మోడల్‌గా నిలిచిందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ పలుగుల మాధవరెడ్డి, కమిషనర్ వేమన రెడ్డి, కౌన్సిలర్లు కొమ్మగోని రమాదేవి, బొక్క సంగీత, బండారి అంజనేయులు, నశ్రీన్ సుల్తానా, సూల్లరి నాగజ్యోతి, బర్ల శశికళ, మేకల పద్మారావు, జహంగీర్, కుతాడి రవీందర్, బత్తుల నరేష్, కో ఆప్షన్ సభ్యులు బొక్క సురేందర్ రెడ్డి, మేనేజర్ అంజిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News