లింగంపేట్ : ప్రధాని నరేంద్ర మోడీ తొమ్మిది సంవత్సరాల పరిపాలన పూర్తి అయిన సందర్భంగా పార్లమెంట్ ప్రవాస్ యోజన కార్యక్రమం ద్వారాబిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాణాల లకా్ష్మరెడ్డి గురువారం లింగంపేట్ మండల కేంద్రంలోని 173 వ పోలింగ్ బూత్ లో గడగపగడపకు తిరిగి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ సుపరిపాలనలో అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టడం జరిగిందన్నారు.
కాని కెసిఆర్ తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను అమలు చేయకుండా ప్రజలకు సంక్షేమ ఫలాలు అందనీయడం లేదన్నారు. ప్రవాస్ యోజన కార్యాక్రమం ద్వారా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రతి బిజెపి కార్యకర్త గడపగడపకు తిరిగి ప్రజలకు తెలియజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో లింగంపేట్ మండల అద్యక్షుడు జక్సాని దత్తురాములు, కిసాన్ మోర్చా జిల్లా ఉపాద్యక్షుడు బొల్లారం సాయిలు, పట్టణ అద్యక్షుడు నవీన్ కుమార్, రాజారామ్, బాలయ్య, మోతీరాం, సురేష్ పోలింగ్ బూత్ నాయకులు పాల్గొన్నారు.