Monday, December 23, 2024

భూ సమస్య పరిష్కరించాలని సెల్ టవర్ ఎక్కిన రైతు

- Advertisement -
- Advertisement -

చెన్నారావుపేట: భూ సమస్యను పరిష్కరించాలని సెల్ టవర్ ఎక్కిన సంఘటన మండల కేంద్రంలో గురువారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే మండలంలోని లింగగిరి గ్రామానికి చెందిన పులి పెద్ద రమేశ్‌కు అదే గ్రామానికి చెందిన తాడబోయిన రా మచంద్రయ్యకు గత కొనేళ్లుగా భూ సమస్య ఉంది. గ్రామంలోని పెద్ద మనుషులు పలుమార్లు పంచాయతీలు నిర్వహింనా సమస్య పరిష్కారం కాకపోవడంతో మనస్తాపానికి గురైన రమేశ్ గు రువారం మండల కేంద్రంలోని ఎస్‌బీఐ బ్యాంకు పక్కనే ఉన్న సెల్ టవర్‌ను ఎక్కి తన భూ సమస్య పరిష్కరించే వరకు దిగనని మారం చేయడంతో ఇన్‌ఛార్జి తహసీల్దారు మధుసూదన్ సం ఘటనా స్థలానికి చేరుకొని సమస్యను పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తాని హామీ ఇవ్వడంతో రమేశ్ టవర్ దిగి వచ్చాడు. ఈ సందర్భంగా రమేశ్ మాట్లాడుతూ.. గత కొద్ది రోజులుగా చెన్నారావుపేట పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ క్రాంతి తనను వేధిస్తున్నాడని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News