Friday, December 20, 2024

భారత్‌లో ఫైటర్ జెట్ ఇంజిన్ల తయారీ

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్: ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటన వేళ భారత్‌అమెరికా మధ్య కీలక ఒప్పందం కుదిరింది. దేశీయంగా ఫైటర్ జెట్ ఇంజిన్ల తయారీకి జిఇ ఏరోస్పేస్‌తో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్‌ఎఎల్) కీలక అవగాహనా ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఇంజిన్లను భారత్‌కు చెందినతేలికపాటి యుద్ధ విమానాలు తేజస్2 లో అమరుస్తారు. జిఇ ఏరోస్పేస్‌కు చెందిన ఎఫ్414 ఇంజిన్లను హెచ్‌ఎఎల్‌తో కలిసి భారత్‌లోతయారు చేయడానికి ఒప్పందం కుదిరినట్లు ఆ కంపెనీ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. దీనికి సంబంధించి అమెరికా ప్రభుత్వంనుంచి కావలసిన ఎగుమతి అనుమతులు తీసుకోనున్నట్లు తెలపింది.‘ భారత్, హెచ్‌ఎఎల్‌తో తమకు ఉన్న చిరకాల అనుబంధం కారణంగానే ఈ చరిత్రాత్మక ఒప్పందం సాధ్యమయిందని జిఇ ఏరోస్పేస్ చైర్మన్, సిఇఓ హెచ్ లారెన్స్ కల్ప్ జూనియర్ ప్రకటించారు.

‘మా ఎఫ్414ఇంజిన్లు సాటి లేనివి. రెండు దేశాలకు ముఖ్యమైన ఆర్థిక, జాతీయ భద్రతా ప్రయోజనాలను అందిస్తాయి.అత్యధిక నాణ్యమైన ఇంజిన్లను ఉత్పత్తి చేయడంలో ముందుంటాం’ అని లారెన్స్ కల్ప్ తెలిపారు. ఎల్‌సిఎ ఎంకె 2ప్రోగ్రామ్‌లో భాగంగా భారత వైమానిక దళం కోసం 99 ఇంజిన్లను నిర్మించడానికి ఈ ఒప్పందం ముందుకు తీసుకువెళ్తుందని అమెరికా దిగ్గజ కంపెనీ జిఇ ఏరోస్పేస్ తెలిపింది.గగనతల పోరాటంలో ఫైటర్ యుద్ధ విమానాలే రారాజులు. వాటికి గుండెకాయలాంటిది అందులోని జెట్ ఇంజిన్. జెట్ ఇంజిన్ల తయారీ పరిజ్ఞానం అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్, రష్యాల వద్ద మాత్రమే ఉంది. దాన్ని ఇతర దేశాలకు బదిలీ చేసేందుకు అవి అంగీకరించడం లేదు.రక్షణ రంగానికి సంబంధించి అనేక రంగాల్లో భారత్ స్వయం సమృద్ధిని సాధించినప్పటికీ జెట్ ఇంజిన్ విషయంలో మాత్రం పురోగతి లేదు. దేశీయంగా అభివృద్ధి చేసిన తేజస్ యుద్ధ విమానం కోసం ‘కావేరి’ ఇంజిన్ ప్రాజెక్టును 986లో ప్రారంభించింది.

ఇందుకు వేలకోట్ల రూపాయలు ఖర్చు చేసినా ఆ ఇంజిన్ ఆశించిన స్థాయిలో పని చేయలేదు. దీంతో తేజస్ విమానాల కోసం జనరల్ ఎలక్ట్రికల్స్‌నుంచి జిఇ ఎఫ్404 ఇంజిన్లను దిగుమతి చేసుకుంది. ఇప్పటికే 75 ఎఫ్ 404 ఇంజిన్లు భారత్‌కు చేరాయి. మరో 99 ఇంజిన్లు రావలసి ఉంది. మరోవైపు 8 ఎఫ్ 414 ఇంజిన్లు భారత్‌కు చేరాయి. తాజా ఒప్పందం ప్రకారం ఇకపై ఈ ఇంజిన్లను భారత్‌లోనే తయారు చేయనున్నారు. ఈ ఒప్పందం వల్ల భారత్‌లో భారీగా కొత్త ఉద్యోగాలు వస్తాయి. ఇంజిన్ల తయారీకి సంబంధించిన పరిజ్ఞానమూ భారత్‌కు బదిలీ అవుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News