Friday, April 11, 2025

భారికేడ్లను ఢీకొట్టిన బైకర్ మృతి

- Advertisement -
- Advertisement -

సదాశివనగర్: మండలంలోని దగ్గి అఠవీ ప్రాంతంలో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందినట్లు ఎస్సై రాజేష్ తెలిపారు. ఇందల్వాయి మండలం వెంగల్పాడ్ గ్రామానికి చెందిన మాలవత్ రెడ్డి 34 తన మేన మామ చంద్రును యాచారం గ్రామంలో ఒదిలి తన కుమారుడు నితిన్ తో కలసి స్వగ్రామానికి బయలు దేరాడు.

మార్గమధ్యలో దగ్గి గ్రామ శివారులోని అఠవీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన భారికేడ్లను ఢీకొని అక్కడక్కడే మృతి చెందాడు. మాలవత్ రెడ్డి హెల్మెట్ ధరించకుండా,అతివేగంగా వెళ్లడంతో ప్ర మాదానికి కారణమని తెలిపారు. ప్ర మాదంలో మృతుడి కుమారుడు నితిన్‌కు ఎలాంటి అపాయం జరుగలేదని పేర్కొన్నారు. మృతుని భార్య లత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దార్యప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News