Sunday, December 22, 2024

కేజీబీవీలో ఎయిడ్స్‌పై అవగాహన

- Advertisement -
- Advertisement -

నల్లబెల్లి: మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ విద్యాలయంలో సంపూర్ణ సురక్ష హెచ్‌ఐవీ ఎయిడ్స్ అవగాహన చైల్డ్ ఫండ్ ఇండియా లింక్ వర్కర్ స్కీం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డీఆర్పీ జ్యోతి, స్థానిక సర్పంచ్ నానబోయిన రాజారాం, ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి ఆచార్య పాల్గొని మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ హెచ్‌ఐవీ, ఎయిడ్స్ గురించి తెలుసుకోవాలన్నారు.

హెచ్‌ఐవీ నాలుగు రకాల పద్ధతుల ద్వారా వ్యాపిస్తుందని, కలుషితమైన సూదుల వాడకం, రక్తమార్పిడి వల్ల సంక్రమిస్తుందన్నారు. హెచ్‌ఐవీ పరీక్ష చేయించుకుని వారి ఆరోగ్య స్థితి తెలుసుకోవాలన్నారు. హెచ్‌ఐవీ సోకినట్లయితే ఏఆర్‌టీ మందులు వాడి జీవితకాన్ని పొడిగించుకోవచ్చన్నారు. అనంతరం పిల్లల వ్యక్తిగత పరిశుభ్రత గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ధర్మేందర్, పీహెచ్‌సీ సిబ్బంది, ఏఎన్‌ఎం జ్యోతి, పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థుల తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News