- Advertisement -
బిక్కనూర్ : పట్టా సర్టిఫికెట్లు వచ్చే వరకు పోరాటం చేస్తామని సిఐటియూ జిల్లా నాయకులు చంద్రశేఖర్ అన్నారు. మండలంలోని జంగంపల్లి గ్రామంలో గురువారం బాధితుల వద్దకు చేరుకుని ఆయన మాట్లాడారు. గ్రామంలో 20 సంవత్సరాల క్రితం పేదలకు భూములు కేటాయించారని గుర్తు చేశారు. వారికి పట్టా సర్గిఫికెట్లు ఇవ్వలేదని ఆరోపించారు. నిరుపేదలకు ఉండటానికి ఇళ్లు లేక ప్రస్థుతం పేదలు గుడిసెలు వేసుకుని కొన్ని నెలలుగా ఇక్కడే నివాసం ఉటుంన్నారని ప్రభుత్వం సహకరించకపోతుందా అని బిక్కు బిక్కు మంటూ ఎదురు చూస్తు న్నారన్నారు. పేదలకు న్యాయం జరిగే వరకు అండగా ఉండి పోరాటం కొనసాగిస్తామన్నారు.
- Advertisement -