Saturday, November 23, 2024

సంతోషం ఒక పాలు.. విషాదం రెండు పాళ్లు..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్:తెలంగాణ రాష్ట్ర ఉద్యమ చరిత్ర చాలా పెద్దదని, ఈ రాష్ట్ర ఉద్యమ ప్రస్థానం చిరస్థాయిగా ఉండాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నారు. ట్యాంక్‌బండ్ వద్ద ఏర్పాటు చేసిన తెలంగాణ అమరవీరుల స్మారక కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో కెసిఆర్ ప్రసంగించారు. ఈ సందర్భంగా సంతోషం ఒక పాలు అయితే.. విషాదం రెండు పాళ్లుగా ఉందని తెలిపారు. రాష్ట్రాన్ని విలీనం చేసే సమయంలోనే అనేక కుట్రకోణాలు దాగి ఉండడంతో, అమాయకులైన ఆనాటి రాజకీయ నాయకులు, ప్రజలు ఏదో మంచి జరుగుతుందన్న ఆశతో బలైపోయారన్నారు. ఆ తర్వాత ఎనిమిది, తొమ్మిది సంవత్సరాలకే ఇబ్బందులు మొదలయ్యాయన్నారు.

మొట్టమొదట ఖమ్మం జిల్లా ఇల్లందులో ఓ ఉద్యమ పొలికేక రావడం, అక్కడి నుంచి 1965, 1966 నుంచి మొదలుకొని 1967 నాటికి యూనివర్సిటీలకు చేరుకుందన్నారు. చాలా ధైర్యంగా 58 ఏళ్ల సమైక్య రాష్ట్రంలో కూడా తమ అస్తిత్వాన్ని కోల్పోకుండా టిఎన్జీఓలు ఉద్యోగులు, ఉపాధ్యాయులు అందరూ కూడా ఈ ఉద్యమంలో ఆసాంతం పాల్గొన్నారన్నారు. ఎన్నో రకాల కేసులు, వేధింపులు, భయంకరమైన పడి యాక్టులు, ఉద్యోగుల బర్తరఫ్‌లు అనుభవించిన బాధలే ఈ రోజు తెలంగాణ అని ఆయన తెలిపారు. ఆనాటి టిఎన్జీఓ నేత ఆమోస్‌ను వీసా యాక్ట్ కింద పెట్టి ఉద్యోగాల్లో తీసేశారని కెసిఆర్ గుర్తు చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News