వనపర్తి : అమరులకు మించిన త్యాగం మరొకటి ఈ సృష్టిలో లేదని, అ మరులను స్మరించుకోవడం అంటే వారి ఆకాంక్షలను నెరవేర్చడమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా చివరి రోజైన గురువారం అమరుల సంస్మరణ వేడుకలను వనపర్తి జిల్లా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ ఆవరణంలో ఘనంగా నిర్వహించారు. జె డ్పి చైర్మన్ ఆర్.లోక్‌నాథ్ రెడ్డి, జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్, జిల్లా ఎస్పి రక్షిత కె మూర్తితో కలిసి అమరవీరుల స్థూపానికి పూలమాల వేసి ఘ నంగా నివాళులర్పించారు.
ఉదయం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ ఆవరణలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన అమరవీరుల స్థూపానికి మంత్రి, జెడ్పి చైర్మెన్, జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పి వరుసగా పూలమాల వేసి నివాళులర్పించారు. అన ంతరం 2 నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ అమరులను స్మరించుకోవడం అంటే కేవలం పూలు చల్లడం కాదని, సమాజంలోని ప్రజలంతా ఉన్నతంగా నిలవాలన్నది వారి ఆలోచన ఆకాంక్ష అని తెలిపారు. తెలంగాణ అమరవీరులు ఏ ఆకాంక్షతో అయితే వారు తమ ప్రాణ త్యాగం చేసి అమరులయ్యారో ఆ ఆకాంక్షలను నెరవేర్చేందుకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత క్రమంలో నెరవేర్చుతూ వస్తుందన్నారు.
అందుకే నేడు తెలంగాణ దేశంలో చాలా విషయాలకు ఆదర్శంగా నిలుస్తుందన్నారు. హైదరాబాద్ రాష్ట్రానికి ఒక ప్రత్యేక చరిత్ర ఉందన్నారు. స్వేచ్ఛ, స్వాతంత్రత్యాల కోసం ప్రపంచంలో అనేక పోరాటాలు జరిగాయని, కానీ 1948 వరకు స్వతంత్ర ప్రాంతంగా కొనసాగిన హైదరాబాద్ సంస్థానం భారత దేశం లో విలీనమైన తర్వాత కొంత ప్రాంతం కర్ణాటక, మహారాష్ట్రలో కలపడం జరిగిందని, అప్పటికి ప్ర త్యేక రాష్ట్రంగా ఉన్న హైదరాబాద్‌ను 1956లో బలవంతంగా ఆవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌లో కలపడం జరిగిందన్నారు. స్వాతంత్య్రం కోల్పోయ స్వాత ంత్య్రం కోసం కొట్లాడిన చరిత్ర తెలంగాణదని తెలిపారు. ప్రజల అభిష్టానికి వ్యతిరేకంగా హైదరాబా ద్ రాష్ట్రం ఆంధ్రాలో విలీనం చేశారని 1956 నుం చి 2014 వరకు అనేక మంది తెలంగాణ కోసం అమరులయ్యారన్నారు.
ఆవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నప్పుడు ఎందరో తమ కులవృత్తుల కోల్పోయారని గుర్తు చేశారు. దాదాపు రెండు తరాలు నష్టపోయాయని, మూడో తరం చేసిన పోరాటంలో తెలంగాణ సాధించుకున్నామన్నారు. సమైక్య పాలకులు మనల్ని బానిసలుగా చూశారని, తెలంగాణ భాష, యాస, అభివృద్ధి, ప్రతిభ వంటి అన్నింటిలో వివక్ష చూపారన్నారు. పాలకుల చిన్న బుద్ధి వల్ల ప్రజల మధ్య విభేదాలు వచ్చాయన్నారు. తొమ్మిదేళ్ల కాల ంలో ప్రాధాన్యత క్రమంలో అన్ని రంగాల్లో అభివృ ద్ధి పనులు చేపట్టి దేశంలో అగ్రగామిగా నిలుస్తుందన్నారు.
అనంతరం వనపర్తి జిల్లా నుంచి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అమరులైన వారి కుటు ంబ సభ్యులను పూలమాల, శాలువాతో సత్కరించి వారితో కలిసి సహపంక్తి భోజనం చేశారు. దాసరి నరేష్ తల్లి దాసరి చెన్నమ్మ,కొత్తకోట నుంచి కా వ లి సువర్ణ తల్లి కావలి రాములమ్మ, వీరాసాగర్ వా రి అక్క పద్మ, సత్యమ్మ కుమారులైన నాగరాజు, ఆ ంజనేయులులను సన్మానించారు.కార్యక్రమంలో జెడ్పి చైర్మన్ ఆర్. లోక్‌నాథ్ రెడ్డి, జిల్లా కలెక్టర్ తేజ స్ నంద్ లాల్ పవార్, జిల్లా ఎస్పి రక్షిత కె మూర్తి, అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్, అడిషన ల్ ఎస్పిషాకీర్ హుస్సేన్, డిఎస్పి ఆనంద్ రెడ్డి, ఆర్డిఓ పద్మావతి, జిల్లా అధికారులు, సిబ్బంది ఉన్నారు.