జగిత్యాల: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తొమ్మిదేళ్లలోనే గణనీయమైన అభివృద్ధిని సాధించి తలసరి ఆదాయంలో దేశంలోనే మొదటి స్థానంలో తెలంగాణ రాష్ట్రం నిలిచిందని, రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. గురువారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాలులో నిర్వహించిన జిల్లా పరిషత్ ప్రత్యేక సమావేశానికి మంత్రి ముఖ్య అ తిథిగా హాజరయ్యారు.
తెలంగాణ కోసం తమ ప్రాణాలు అర్పించిన అమరవీరుల సంస్మరణ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాటు చేసిన జడ్‌పి ప్రత్యేక సమావేశంలో అమరవీరుల కుటుంబ సభ్యులను మంత్రి శాలువాలతో సన్మానించి జ్ఞాపికలను అం దజేశారు. ఈ సందర్భంగా మంత్రి ఈశ్వర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం అలుపెరుగని పోరాటం చేసిన ముఖ్యమంత్రి కెసిఆర్ తెలంగాణను అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపేందుకు అవిరళ కృషి చేశారన్నారు.
గత 65 యేళ్లలో జర గని అభివృద్ధిని కేవలం తొమ్మిదేళ్లలో చేసి చూపించారన్నారు. తెలంగాణలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ఇతర రాష్ట్రాల పాలకులు, అధికారులు పరిశీలించి ఆయా రాష్ట్రాల్లో అమలు చేసేందుకు కార్యాచరణ సిధ్దం చేసుకుంటున్నారన్నారు. దే శంలో ఎక్కడా లేని విధంగా అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రవేశపెట్టి తెలంగాణను రోల్ మోడల్‌గా నిలిపిన ఘనత సిఎం కెసిఆర్‌కే దక్కిందన్నారు.
రాష్ట్ర తలసరి ఆదాయంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం నంబర్‌వన్‌గా నిలవడం రాష్ట్ర ప్రజలందరికీ గర్వకారణమన్నారు. ఏ రంగంలో చూసినా తెలంగాణ రాష్ట్రమే నంబర్‌వన్‌గా ఉందని, ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నా మన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం అసువులు బాసిన అమరవీరుల కళలను నిజం చేసేలా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందన్నారు.
శాసన మండలి సభ్యుడు ఎల్.రమణ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సమయంలో మా ప్రాం తానికి నిధులు ఇవ్వాలని అసెంబ్లీలో శాసన సభ్యులు అడిగితే నయా పైసా ఇచ్చేది లేదు… ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మాటలు ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నామన్నారు.
నీళ్లు, నిధులు, నియామకాల్లో తీరని అన్యాయం చేశారన్నారు. తెలంగాణ కోసం తమ ప్రాణాలర్పించిన అమరవీరుల కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదు కుంటోందని అన్నారు. జడ్‌పి చైర్ పర్సన్ దావ వసంత మాట్లాడుతూ స్వరాష్ట్రం కోసం ఎంతోమంది తమ ప్రాణాలను అర్పిం చారని, వారిని స్మరించుకోవడం కోసమే జడ్‌పి ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశామని, వారికి ఘన నివాళులర్పిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేసినట్లు పేర్కొన్నారు.
జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా మాట్లాడుతూ తొమ్మిదేళ్లలో తెలంగాణ రాష్ట్రం సాధిచిన ప్రగతి ని వివరిస్తూ 20 రోజుల పాటు రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నామని, చివరి రోజున స్వరాష్ట్రం కోసం అసువులు బాసిన అమరవీరులకు నివాళులర్పించే కార్యక్రమంతో ఉత్సవాలు ముగుస్తున్నాయన్నారు.
ఎంఎల్‌ఎ డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ కోసం అమరులైన వారి కుటుంబాలను తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలా అదుకోవడంతో పాటు ఊరూరా అమరవీరుల స్థూపాలను ఏర్పాటు చేసి వారిని స్మరించుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్‌పి భాస్కర్, అదనపు కలెక్టర్లు బిఎస్ లత, మంద మకరంద్, జడ్‌పిసిఇఓ రామానుజాచారి, జడ్‌పిటిసిలు, అధికారులు పాల్గొన్నారు.