Saturday, November 23, 2024

ప్యాక్స్ కేంద్రాల్లో ధాన్యం కొనుగోల్లు పూర్తి

- Advertisement -
- Advertisement -

తంగళ్లపల్లి: మండలంలోని 19 గ్రామాల్లో సిరిసిల్ల ప్యాక్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతుల నుండి సేకరించిన ధాన్యం కొనుగోలును పూర్తి చేసినట్లు సిరిసిల్ల ప్యాక్స్ చైర్మన్ బండి దేవదాస్ వెల్లడించారు.ఈమేరకు వివిధ గ్రామాల్లో 2478 రైతుల నుండి సేకరించిన ధాన్యం వివరాలను తెలిపారు.

అంకుసాపూర్ గ్రామంలో 142 మంది రైతుల నుండి 11,652.40 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేయగా రూ.2,63,34,424లు వారి ఖాతాల్లో జమచేశారు.బద్దెనపల్లి గ్రామంలో 91 మంది రైతుల నుండి 7347.20 క్వింటాళ్ల ధాన్యం సేకరించగ రూ.1,51,35,232లు రైతుల ఖాతాల్లో జమచేశారు.

బస్వాపూర్ గ్రామంలో 135 మంది రైతుల నుండి 8860.40 క్వింటాళ్ల ధాన్యం సేకరించగా రూ.1,82,52,424లు రైతుల ఖాతాల్లో జమ చేశారు.చింతల్‌ఠాణా గ్రామంలో 41 మంది రైతుల నుండి 2868.40 క్వింటాళ్ల ధాన్యం సేకరించగా రూ.59,08,904లు రైతుల ఖాతాల్లో జమ చేశారు.

చింతల్‌పల్లి గ్రామంలో 58 మంది రైతుల నుండి 4300.40 క్వింటాళ్ల ధాన్యం సేకరించగా రూ.88,58,824లు రైతుల ఖాతాల్లో జమ చేశారు.చీర్ల వంచ గ్రామంలై 130 మంది రైతుల నుండి 14452.20 క్వింటాళ్ల ధాన్యం సేకరించగా రూ.2,97,71,532లు రైతుల ఖాతాల్లో జమ చేశారు.దేశాయిపల్లె గ్రామంలో 84 మంది రైతుల నుండి 5696 క్వింటాళ్ల ధాన్యం సేకరించగా రూ.1,17,33,760లు రైతుల ఖాతాల్లో జమ చేశారు.

గండిలచ్చపేట గ్రామంలో 189 మంది రైతుల నుండి 10435.20 క్వింటాళ్ల ధాన్యం సేకరించగా రూ.2,14,96,512లు రైతుల ఖాతాల్లో జమ చేశారు.కస్బెకట్కూర్ గ్రామంలో 77 మంది రైతుల నుండి 6100 క్వింటాళ్ల ధాన్యం సేకరించగా రూ.లక్షా 25 వేల 66వేలు రైతుల ఖాతాల్లో జమ చేశారు.లక్ష్మిపూర్ గ్రామంలో 146 మంది రైతుల నుండి 12వేల క్వింటాళ్ల ధాన్యం సేకరించగా రూ.2,47,20,000 లు రైతుల ఖాతాల్లో జమచేశారు.

మండెపల్లి గ్రామంలో 215 మంది రైతుల నుండి 17304.40 క్వింటాళ్ల ధాన్యం సేకరించగా రూ.3,56,47,064 లు రైతుల ఖాతాల్లో జమ చేశారు.ఒబులాపూర్ గ్రామంలో 172 మంది రైతుల నుండి 11వేల క్వింటాళ్ల ధాన్యం సేకరించగా రూ.2,26,60,000లు రైతుల ఖాతాల్లో జమ చేశారు.పాపయ్యపల్లె గ్రామంలో 98 మంది రైతుల నుండి 7283.20 క్వింటాళ్ల ధాన్యం సేకరించగా రూ.1,50,03,392లు రైతుల ఖాతాల్లో జమచేశారు.

రాళ్లపేట గ్రామంలో 125 మంది రైతుల నుండి 6964.80 క్వింటాళ్ల ధాన్యం సేకరించగా రూ.1,43,47,488లు రైతుల ఖాతాల్లో జమచేశారు.రామన్నపల్లె గ్రామంలో 162 మంది రైతుల నుండి 13387.90 క్వింటాళ్ల ధాన్యం సేకరించగా రూ.2,75,79,074లు రైతుల ఖాతాల్లో జమచేశారు.సారంపల్లి గ్రామంలో 85 మంది రైతుల నుండి 6884.80 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేయగా రూ.1,41,82,688లు రైతుల ఖాతాల్లో జమచేశారు.

సిరిసిల్లలో 178 మంది రైతుల నుండి 17097.60 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేయగా రూ.3,52,21,056లు రైతుల ఖాతాల్లో జమ చేశారు.తాడూర్ గ్రామంలో 135 మంది రైతుల నుండి 7077.20 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేయగా రూ.1,45,79,032లు రైతుల ఖాతాల్లో జమ చేశారు.తంగళ్లపల్లి గ్రామంలో 127 మంది రైతుల నుండి 8788.40 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేయగా రూ.1,81,04,104లు రైతుల ఖాతాల్లో జమ చేశారు

.వేణుగోపాల్ పూర్ గ్రామంలో 88 మంది రైతుల నుండి 6768 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేయగా రూ.1,39,42,080లు రైతుల ఖాతాల్లో జమ చేశారు. మొత్తం లక్షా 86వేల 268.50 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేసినట్లు తెలిపారు.అలాగే రూ.38,60,43,590లు రైతుల ఖాతాల్లో జమచేసినట్లు పేర్కొన్నారు.కొనుగోలు కేంద్రాల్లో సహకరించిన రైతులకు,హమాలీలకు,నాయకులకు,గ్రామస్థులు చైర్మన్ దేవదాస్ కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News