లక్షెట్టిపేట : రాజకీయ సంస్కారం లేని వ్యక్తి బండి సంజయ్ అని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివార్‌కరావు ధ్వజమెత్తారు. గురువారం పట్టణంలోని ఐబీ విశ్రాంత భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బండి సంజయ్‌కు ఒక సీఎంను ఎలా సంభోదించాలో కూడా తెలియదని ఎద్దేవ చేశారు.
పీఎంగా, పార్టీ అద్యక్షునిగా ఉండి కనీస ఇంకిత జ్ఞానం లే కుండా మాట్లాడడం సరికాదన్నారు. మేము కూడా ప్రధాని మోడీ తప్పుడు పదజాలంతో విమర్శించలేమా అని ఎదురు ప్రశ్నించా రు. కాని హద్దులు దాటి కేవలం ప్రచారం కోసం చేసే సంస్కృతి బీఆర్‌ఎస్‌కు లేదని హితవు పలికారు. తెలంగాణ ప్రభుత్వం చేస్తు న్న అభివృద్ధిని చూసి ఓర్వలేక అబద్ధాలు మాట్లాడుతున్నారని ఆయన అన్నారు.
కుల వృత్తులతో పాటు అన్ని వర్గాల వారికి పలు సంక్షేమ పథకాలతో ప్రభుత్వం మేలు చేస్తుందని వివరించారు. మెడికల్ కళాశాల ఏర్పాటులో కేంద్ర ప్రభుత్వం పాత్ర శూన్యమని ఆయన అన్నారు. వడ్లు కొనలేని బీజేపీ కేంద్ర ప్రభుత్వం రైతుల గురించి మాట్లాడడం సిగ్గుచేటన్నారు. బీజేపీ ప్రభుత్వం దేశాన్ని ప్రైవేటుపరం చేస్తుందని వివరించారు.
దేశ ఆర్థ్దిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసిన ఘనత బీజేపీకి దక్కుతుందన్నారు. ఈడీ, సీబీఐల తో దాడులు చేస్తూ అధికారంలోకి రావడం, మతకలహాలను సృష్టించి పబ్బం గడుపుకోవడమే బీజేపీ నైజమని మండిపడ్డారు. సీ ఎం కేసీఆర్‌ను తప్పుడు పదజాలంతో మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదని బీజేపీ నాయకులను హెచ్చరించారు.
ఈ కార్యక్రమం లో మున్సిపల్ చైర్మన్ కాంతయ్య, వైస్ చైర్మన్ పొడేటి శ్రీనివాస్ గౌడ్, డీసీఎంఎస్ చైర్మన్ తిప్పని లింగయ్య, మాజీ డీసీఎంఎస్ శ్రీనివాస్‌రెడ్డి, బీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు పాదం శ్రీనివాస్, కౌన్సిలర్లు సురేష్ నాయక్, మెట్టు కళ్యాణి రాజు, షబానా సజ్జు, నాయకులు అంకతి గంగాధర్, రాగుల రాజేషం, తిరుపతి, తదితరులు పాల్గొన్నారు.