Saturday, November 16, 2024

మళ్లీ దీవించండి

- Advertisement -
- Advertisement -

మన రా ష్ట్రంలో కొనసాగుతున్న ప్రగతి ఇదే విధంగా కొనసాగాలంటే తమ ప్రభుత్వాన్ని మళ్లీ దీవించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రజలను కోరా రు. నిన్నా మొన్న 20 రోజుల నుంచి ఎలా కార్యక్రమాలు చేశారో.. అలాగే రాబోయే రోజుల్లో ప్ర భుత్వాన్ని దీవిస్తే బ్రహ్మాండమైన అభివృద్ధిని చేసుకుందామని అన్నారు. గురువారం సంగారెడ్డి జి ల్లాలో పర్యటించిన సిఎం కెసిఆర్ పటాన్‌చెరు రూ.183 కోట్లతో 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి భూమిపూజ చేశారు. అనంత రం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సి ఎం మాట్లాడారు. మోసపోతే.. గోసపడుతాం… ఏ ఉద్దేశంతో తెలంగాణను తెచ్చుకున్నమో.. దాన్ని బ్రహ్మాండంగా ఒకగాడిలో పెట్టుకొని ఆర్థికపరం గా ముందుకెళ్తున్నామని సిఎం కెసిఆర్ వ్యాఖ్యానించారు. పేదల సంక్షేమానికి కృషి చేస్తున్నామని చెప్పారు.

వైద్య ఆరోగ్య రంగంలో పరిస్థితి ఎలా ఉండేదో తెలుసు అని, హైదరాబాద్‌కు వెళితే గాంధీ, ఉస్మానియా, నిలోఫర్ తప్ప మరొకటి లేకుండే అని పేర్కొన్నారు. అద్భుతమైన ఐదు కార్పొరేట్ స్థాయిలో ఆసుపత్రులు తీసుకువస్తున్నామని చెప్పారు. ప్రభుత్వరంగంలో 17వేల పడకలు ఉంటే.. ప్రస్తుతం 50 వేల పడకలను అందుబాటులోకి తీసుకురాబోతున్నామని అన్నారు. అదేవిధంగా పత్రి బెడ్‌కు ఆక్సిజన్ ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. దగ్గరలోని ఇస్నాపూర్‌లోనే 500 టన్నుల ఆక్సిజన్ తయారుచేసే యూనిట్‌ను ఏర్పాటు చేసుకున్నామని, ఎవరినో అడుగకుండా మన ఆక్సిజన్ మనమే తీసుకునే విధంగా పెట్టుకున్నామని తెలిపారు. కొనసాగుతున్న ఈ రాష్ట్ర ప్రగతి ఇదే విధంగా మళ్లీ ముందు కొనసాగాలంటే..
నేను కలలుగన్న బంగారు తెలంగాణ సాకరమై తీరుతుంది
కావాల్సిన పనులన్నీ చాలా గొప్పగా చేసుకొని ముందుకెళ్దామని ముఖ్యమంత్రి కెసిఆర్ తెలిపారు. ఈ రాష్ట్రం ఇంత త్వరలో ఇంత బాగైతుందని ఎవరూ ఊహించలేదని వ్యాఖ్యానించారు. తాను కలలుగన్న బంగారు తెలంగాణ సాకరమై తీరుతుందని చెప్పారు. మనకు నిజాయితీ, చిత్తశుద్ధి ఉంది కాబట్టి.. ప్రజలను మంచిగా చూసుకోవాలనే తపన ఉంది కాబట్టి ముందుకెళ్తున్నామని అన్నారు. తెలంగాణ అమరవీరులను స్మరించుకోవాలి.. జీవితాలను అర్పించడం కంటే గొప్పత్యాగం మరొకటి ఉండదని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలను ధారబోసి త్యాగాలు చేశారు కాబట్టి.. దశాబ్ది ఉత్సవాల ముగింపులో వారందరినీ తలచుకోవడం మనందరి కర్తవ్యమని తెలిపారు.
ఎన్నికల్లో గెలిపిస్తే సంగారెడ్డి నుంచి హయత్‌నగర్ మెట్రో వస్తుంది
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపిస్తే సంగారెడ్డి టూ హయత్‌నగర్ వరకు మెట్రోకు మంజూరు చేస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరావు వెల్లడించారు. ఇటీవల విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నియోజకవర్గానికి వెళితే.. మహేశ్వరానికి మెట్రో రావాలని కోరారని, అక్కడే ఆ సభలోనే తాను చెప్పానని అన్నారు. హైదరాబాద్ సిటీలో అత్యధికంగా ట్రాఫిక్ ఉండే కారిడర్ పటాన్‌చెరు నుంచి దిల్‌సుఖ్‌నగర్ అని, పటాన్‌చెరు నుంచి హయత్‌నగర్ వరకు మెట్రోరావాల్సి ఉందని తెలిపారు. మళ్లీ ఎన్నికల్లో గెలిస్తే మెట్రో తప్పకుండా వస్తుందని చెప్పారు.

మళ్లీ వచ్చే ప్రభుత్వం తొలి కేబినెట్ సమావేశంలో పటాన్‌చెరు నుంచి హయత్‌నగర్ మెట్రోరైలుకు మంజూరు ఇప్పిస్తానని తాను వ్యక్తిగతంగా వాగ్ధానం చేస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ రాష్ట్రం కాకముందు ఈ జిల్లాల్లో మంత్రిగా పని చేస్తూ పటాన్‌చెరుకు వచ్చానని, ఇక్కడే సంగారెడ్డి అతిథిగృహంలో ఉంటూ పటాన్‌చెరులో గల్లీగల్లీ పాదయాత్ర చేశానని తెలిపారు. ఇంచుమించు అన్ని సమస్యలు తెలుసు అని పేర్కొన్నారు. మహిపాల్‌రెడ్డి నాయకత్వంలో పటాన్‌చెరు ముందుకు దూసుకెళ్తున్నదన్నారు. మాజీ ఎంఎల్‌ఎ సత్యనారాయణ ఇక్కడి వరకు మెట్రోరైలు రావాలని కోరారని అన్నారు. రాష్ట్రం ఏర్పడే క్రమంలో అనేక అపవాదులు, అపోహలు, అనుమానాలు కలిగించారని గుర్తు చేశారు. తెలంగాణ చిమ్మని చీకటవుతుంది.. కరెంటు రానే రాదన్నారని మండిపడ్డారు.

పటాన్‌చెరులో అప్పుడు పరిశ్రమల వాళ్లు కరెంటు కావాలని సమ్మెలు చేసేవారని, ఇవాళ మూడుషిఫ్టుల్లో పరిశ్రమలు నడుస్తున్నాయని చెప్పారు. భారతదేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణలో పరిశ్రమలకు 24 గంటల కరెంటు ఇస్తున్నామని తెలిపారు. కష్టాలు, నష్టాలకోర్చి పరిశ్రమలు, డొమెస్టిక్, గృహాలకు, కమర్షియల్, వ్యవసాయానికి 24 గంటల కరెంటు ఇచ్చే రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు. ఇంటింటికీ నల్లాపెట్టి నీళ్లిచ్చే రాష్ట్రం తెలంగాణ అని, తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ నెంబర్ వన్ తెలంగాణ అని అన్నారు. ఎందుకు కొరగాకుండాపోతారని ఎవరైతే శాపాలు పెట్టారో వారిని మించిపోయి.. 3.17 లక్షలతో పర్ క్యాపిటా ఇన్‌కంలో దేశంలో తెలంగాణ నెంబర్ వన్ స్థాయికి చేరుకున్నామని తెలిపారు.
సంగారెడ్డి జిల్లాపై వరాల జల్లు
సంగారెడ్డి జిల్లాపై ముఖ్యమంత్రి కెసిఆర్ వరాల జల్లు కురిపించారు. పారిశ్రామిక ప్రాంతానికి ప్రత్యేకంగా పాలిటెక్నిక్ కావాలని ఎంఎల్‌ఎ మహిపాల్‌రెడ్డి అడిగారు..ఇవాళనే మంజూరు చేస్తూ జీవో జారీ చేస్తామని సిఎం వెల్లడించారు. రెవెన్యూ డివిజన్ కావాలని అడుగుతున్నారని.. తప్పకుండా నెరవేరుస్తామని చెప్పారు. ఈ ప్రాంతంలో విపరీతమైనటువంటి కాలనీలు వస్తున్నయని చెప్పారు. కొల్లూరులో 17 వేలపైచీలుకు డబుల్ రూం ఇండ్లకు ప్రారంభోత్సవం చేశామని, పటాన్‌చెరువుకు 2 వేల ఇండ్లు కేటాయిస్తున్నామని అన్నారు. రామసముద్రం చెరువు సుందరీకరించి గొప్పగా చేయాలని మహిపాల్‌రెడ్డి కోరుతున్నారని,

ఇరిగేషన్ శాఖ నుంచి నిధులు మంజూరు చేయాలని హరీర్‌రావుకు చెప్పారు. సిద్దిపేట కోమటిచెరువు తరహాలో అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. కాలనీలు వచ్చిన వెంటనే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రాదని, అదనంగా సహాయం కావాలని ఎంఎల్‌ఎ కోరుతున్నారని, జిల్లాలోని ఒక్కో మున్సిపాలిటీకి రూ.30 కోట్లు, ప్రతి డివిజన్‌కు రూ.10 కోట్లు ఇస్తామని సిఎం ప్రకటించారు. 55 గ్రామ పంచాయతీల ప్రత్యేక అభివృద్ధి కోసం సిఎం ఫండ్ నుంచి ఒక్కో పంచాయతీకి రూ.15 లక్షల చొప్పుల మంజూరు చేస్తున్నట్లు సిఎం కెసిఆర్ ప్రకటించారు.
ఐటీ కంపెనీలు వచ్చే ఏర్పాట్లు..
పటాన్‌చెరుకు పరిశ్రమలు బాగా నడుస్తున్నయని సిఎం అన్నారు.కండ్ల అద్దాలు తయారు చేసే.. మెడికల్ డివైజెస్ పార్క్ వస్తే.. ఆ ఒక్క పార్కులో 15 వేల మంది పని చేస్తున్నారని చెప్పడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. పటాన్‌చెరు ఇంకా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఇక్కడికి ఐటీ ఇండస్ట్రీని మంత్రి కెటిఆర్‌ను పంపిస్తానని, త్వరలో ఐటీ కంపెనీలు వచ్చేలా ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. మాజీ సీఎస్ రాజీవ్శర్మకు పదవీ విరమణ చేశాక తన కోరిక మేరకు పొల్యూషన్ బోర్డ్ చైర్మన్‌గా కొనసాగుతున్నారని,

ఈ ప్రాంతంలో పొల్యూషన్ రాకుండా చర్యలు తీసుకోవడంతో పాటు ఇక్కడ సూపర్ స్పెషల్ హాస్పిటల్ వచ్చేలా రాజీవ్ శర్మ చొరవ చూపారని కొనియాడారు. మనం కడుతున్న డబుల్ బెడ్రూం ఇండ్లు భారత్‌లో ఎక్కడా ఉండవని, మంచినీళ్ల సరఫరా ఎక్కడా కనిపించదని, అద్భుతమైన కాళేశ్వరం ప్రాజెక్టు తీసుకొని రాష్ట్రంలో నీళ్ల కరువు లేకుండా మటుమాయం చేసుకున్నామన్నారు. ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేసుకోవాల్సి ఉందని సిఎం కెసిఆర్ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News