Friday, December 20, 2024

పూర్ణానంద రిపోర్ట్‌లో సంచలన విషయాలు… గర్భం దాల్చిన బాలిక

- Advertisement -
- Advertisement -

అమరావతి: పూర్ణానంద రిపోర్ట్‌లో సంచలన విషయాలు దిశ పోలీసులు వెల్లడించారు. పూర్ణానందకు జూలై 5 వరకు రిమాండ్ విధించారు. పూర్ణానంద అర్ధరాత్రి బాలికలను నిద్ర లేపి తన గదిలోకి బాలికలను తీసుకెళ్లి అత్యాచారం చేసేవాడని దిశ డిఎస్‌పి వెల్లడించారు. బాలికపై సంవత్సరం నుంచి అత్యాచారం చేయడంతో ఆమె గర్భం దాల్చిందని పేర్కొన్నారు. ఇద్దరు బాలికలపై పూర్ణానంద అత్యాచారం చేసినట్టు ప్రాథమిక ఆధారాలు లభించాయని రిమాండ్ రిపోర్ట్‌లో దిశ పోలీసులు పేర్కొన్నారు. బాలికలు గర్భం దాల్చకుండా పూర్ణానంద టాబ్లెట్స్ ఇచ్చేవాడని, ఆశ్రమంలో మొత్తం ముగ్గురు బాలికలు, తొమ్మిది మంది బాలుర్లు ఉన్నారని చెప్పారు. బాలికలపై అత్యాచారం జరిగినట్లు ఎఫ్‌ఎస్‌ఎల్ నివేదిక వచ్చిందని డిఎస్‌పి పేర్కొన్నారు.

Also Read: తరతరాలకు స్ఫూర్తినిచ్చేలా….

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News