నాచారం: హైదరాబాద్‌లోని నాచారంలో శుక్రవారం విషాద సంఘటన వెలుగుచూసింది. ఫ్యాన్ కు ఉరివేసుకుని సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ఆత్మహత్య చేసుకుంది. మృతురాలిని సనగా గుర్తించారు. ఐదు నెలల నుంచి తన భర్త హేమంత్ వేధిస్తున్నాడని ఫేస్ బుక్ లో లైవ్ పెట్టి తన ఆవేదనను వ్యక్తం చేసింది. గత ఐదు నెలలుగా తను పడుతున్న కష్టాలను వెలుగులోకి తెచ్చింది. రాజస్థాన్ నివాసి ప్రస్తుతం నాచారంలో సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తున్నట్లు సమాచారం.
Also Read: మోడీ వైట్ హౌస్ విందులో అంబానీ, పిచయ్ కుటుంబాలు
బాధితురాలు తన మానసిక క్షోభ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో షేర్ చేయడంతో వీక్షకులను దిగ్భ్రాంతికి గురి చేసింది. బాధాకరమైన సంఘటనతో స్థానిక అధికారులు తక్షణమే అప్రమత్తమయ్యారు. కానీ అప్పటికే ఆమె ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. అనంతరం దర్యాప్తు చేస్తున్నారు.