Monday, December 23, 2024

అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి

- Advertisement -
- Advertisement -

నారాయణఖేడ్ టౌన్: అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతిచెందిన సంఘటన ఖేడ్‌లో శుక్రవారం చోటు చేసుకుంది. ఖేడ్ ఎస్‌ఐ ఏడుకొండలు తెలిపిన వివరాల ప్రకారం … ఖేడ్ పట్టణంలోని బిడెకన్నె హన్మంతు వెంచర్‌లో చెట్టుకు యువకుడి మృతదేహం ఉన్నట్లు సమాచారం మేరకు సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించడం జరిగిందన్నారు. సుమారు 25 నుంచి 30ఏళ్ల వయస్సు ఉన్న యువకుడు చెట్టుకు నిర్జీవంగా వెలాడుతూ ఉన్నాడన్నారు. ఇతరులను విచారించగా కల్హేర్ మండల పరిధిలోని బీబీపేట్‌తండాకు చెందిన వ్యక్తిగా గుర్తించడం జరిగిందన్నారు. యువకుడి మరణానికి గల కారణాలు పూర్తిగా తెలియలేదన్నారు. మృతదేహాన్ని మార్చురికీ తరలించి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపడుతున్నట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News