Sunday, September 22, 2024

 పంటల సాగు, సాంకేతిక అంశాలపై అవగాహన

- Advertisement -
- Advertisement -

జహీరాబాద్: జహీరాబాద్ డివిజన్ పరిధిలో మండల వ్యవసాయ అధికారులకు, వ్యవసాయ విస్తరణ అధికారులకు వివిధ రకాల పంటలకు సంబంధించిన సాంకేతిక అంశాలపైన వ్యవసాయ పరిశోదక కేంద్రం ప్రదాన శాస్త్రవేత్త డాక్టర్ విజయ్‌కుమార్ అవగాహన కల్పించారు. ముందుగా వేరు పురుగు సమస్య ఉన్న చెరకు పంట పొలాన్ని సందర్శించి రైతులకు సూచనలు చేశారు. అనంతరం స్థానిక సహాయ వ్యవసాయ సంచాలకులు బిక్షపతి మాట్లాడుతూ క్లస్టర్ వారీగా పంటల వారీగా సమస్యలను శాస్త్రవేత్తకు తెలపాలని కోరారు.

ఈ సందర్భంగా చెరుకులో అధికంగా వేరు పురుగు, జొన్న మల్లె కలుపు సమస్యను శాస్త్రవేత్తకి వివరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చెరుకులో వేరు పురుగు నివారణకు జీవ రసాయన మందు అయిన మెటారైజియంను డ్రిప్ ద్వారా పంపించాలని చెప్పారు. అలాగే రసాయన మందు లాసెంటా ద్వారా కూడా నివారించుకోవచ్చని తెలిపారు. జొన్నమల్లె ఈ కలుపు మొక్క చెరుకు పై ఆదారపడి వేరు మొదల్లో పెరుగుతూ చెరకు పంట పెరుగుదలను నియంత్రిస్తుందన్నారు.

దీని నివారణకు రసాయన పద్దతిలో 2,4-D సోడియం సాల్ట్ 6 గ్రా/లీటర్+యూరియా 20 గ్రా/లీటర్ నీటిలో కలిపి వేరు మొదళ్లు పూర్తిగా తడిచేలా భూమిలో పోసుకోవాలని తెలిపారు. వర్షాలు లేని కారణంగా కంది లాంటి పంటలను నర్సరీ పద్దతిలో పెంచుకోని నాటుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో అన్ని మండలాల వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులు, స్థానిక గ్రామ సర్పంచ్ జగన్మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News