Saturday, November 23, 2024

ఇందిరతో జైలుపాలయ్యి రాహుల్‌కు జేజేలు: నద్డా

- Advertisement -
- Advertisement -

భవానీపట్టణ : నాయినమ్మతో జైల్లో పడ్డవారు ఇప్పుడు ఆమె మనవడికి సలాంలు స్వాగతాలు పలుకుతున్నారని బిజెపి అధ్యక్షులు జెపి నడ్డా విమర్శించారు. పాట్నాలో శుక్రవారం జరిగిన ప్రతిపక్ష సభపై ఒడిషాలోని కలహనిధిలో జరిగిన బహిరంగ సభలో బిజెపి నేత స్పందించారు. అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ అత్యవసర పరిస్థితి విధింపు దశలో అప్పుడు పలువురు నేతలు జైళ్ల పాలయ్యారని, విచిత్రమైన రీతిలో ఈ నేతలు, ఆ పార్టీల వారు రాహుల్ గాంధీకి జైకొడుతున్నారని తెలిపారు. పాట్నా ప్రతిపక్ష సభకు బీహార్ సిఎం నితీశ్ కుమార్, ఆర్జేడీ దిగ్గజం లాలూ ప్రసాద్ యాదవ్ హాజరవుతున్న విషయాన్ని నడ్డా ప్రస్తావించారు. అప్పట్లో జైప్రకాశ్ నారాయణ్ చేపట్టిన ఉద్యమంలో వీరు విద్యార్థి నేతలుగా పాల్గొన్నారని, జైలు పాలయ్యారని గుర్తు చేశారు.

రాజకీయాల్లో బహు విచిత్రాలు జరుగుతాయని చెప్పడానికి ఈ నేతలు ఈ వేదికపైకి రావడం మరో ఉదాహరణ అని చెప్పారు. అప్పట్లో లాలూ 22 నెలల పాటు జైలు పాలయ్యారు. కాగా ఇప్పుడు ప్రతిపక్ష ఐక్యభేటీకి సారధ్యం వహించిన నితీశ్ కుమార్ 20 నెలలు చెరసాల జీవితం గడిపారని, మరి వీరికి ఎమర్జెన్సీ జైలు గుర్తుకురాలేదా? అని ప్రశ్నించారు. విపక్ష భేటీలో పాలుపంచుకునేందుకు మహారాష్ట్ర నుంచి ఉద్ధవ్ థాకరే కూడా విచ్చేశారని, మరి ఆయన తండ్రి హిందూ హృదయ సామ్రాట్ బాలా సాహెబ్ థాకరే తన జీవితకాలం అంతా కాంగ్రెస్‌ను వ్యతిరేకించారని గుర్తు చేశారు. అప్పట్లో ఓ దశలో బాలా సాహెబ్ థాకరే తాను కాంగ్రెస్‌లో చేరడం కన్నా తన దుకాణం (శివసేన) మూసుకుంటానని తెలిపారని, మరి ఇప్పుడు ఆయన కుమారుడు ఈ దుకాణానికి తాళాలు వేసుకుంటున్నట్లేనా అని ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News