Saturday, November 23, 2024

ఎల్బీ స్టేడియంలో ఘనంగా ఒలింపిక్ దినోత్సవ వేడుకలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : అంతర్జాతీయ ఒలింపిక్ దినోత్సవ వేడుకలు హైదరాబాద్ ఎల్ బి స్టేడియంలో క్రీడాకారుల కేరింతల మధ్య ఉత్సాహంగా జరిగాయి. ఈ సందర్భంగా తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ (శాట్స్), తెలంగాణ ఒలంపిక్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో రాష్ట్రంలోని ప్రముఖ క్రీడాకారులను ఈ సందర్భంగా ఘనంగా సత్కరించి అభినందించారు. ఒలింపిక్ దినోత్సవం నేపథ్యంలో ఈ మేరకు శుక్రవారం ఒలంపిక్ డే రన్‌ను కూడా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో క్రీడాశాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్, శాట్స్ ఛైర్మన్ ఆంజనేయ గౌడ్, ఒలపిక్ అసోసియేషన్ అధ్యక్షులు, మాజీ మంత్రి సముద్రాల వేణుగోపాలాచారి, కొల్లాపూర్ శాసనసభ్యులు హర్షవర్ధన్ రెడ్డి తదితరులు ఒలింపిక్ డే రన్ ముగింపు వేడుకలను పురస్కరించుకుని ఎల్‌బి స్టేడియంలో ఒలింపిక్ జ్యోతిని స్వీకరించారు. ఇటు తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు సక్సెస్‌ఫుల్‌గా ముగియడం, అటు ఒలింపిక్ దినోత్సవం నేపథ్యంలో వివిధ క్రీడా ప్రాంగణాల నుంచి ప్రారంభమైన క్రీడాజ్యోతిలు శుక్రవారం ఎల్బీ స్టేడియంకు చేరుకోగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ నేపథ్యంలో ఆ జ్యోతిని స్వీకరించారు.

అంతకు ముందు తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ ( శాట్స్ ), తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో రాష్ట్రంలోని ప్రముఖ క్రీడాకారులు ఎల్‌బి స్టేడియంకు రాగా వారిని సన్మానించడం విశేషం. ఇంకా ఈ కార్యక్రమంలో క్రీడల శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ఒలింపిక్ డే రన్ స్టీరింగ్ కమిటీ చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డి, తెలంగాణ క్రీడా ఒలింపిక్ అసోసియేషన్ సెక్రెటరీ జగదీశ్వర్ యాదవ్, ఉపాధ్యక్షులు ప్రేమ్ రాజ్, మర్రి లక్ష్మణ్ రెడ్డి, అర్జున అవార్డు గ్రహీతలు అనూప్ యామా, పారా ఒలింపిక్ క్రీడాకారులు అంజనా రెడ్డి, వివిధ క్రీడా సంఘాల అధ్యక్షులు, కార్యదర్శులు, క్రీడాకారులు క్రీడాభిమానులు, కోచ్‌లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Olympic Run 2

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News