Monday, December 23, 2024

ద్విచక్రవాహనంపై నుండి పడి యువకుడు మృతి

- Advertisement -
- Advertisement -

బాసర : ద్విచక్రవాహనంపై నుండి పడి యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన బాసర మండలంలోని మహారాష్ట్ర సరిహద్దు అయిన లాబ్ది సమీపంలో చెక్‌పోస్టు సమీపంలో శుక్రవారం చోటు చేసుకుంది.బాసర ఎస్‌ఐ మహేష్ తెలిపిన వివరాల ప్రకారం …
బిద్రెల్లి గ్రామానికి చెందిన కర్కెల్లి మహేష్ (25) మహారాష్ట్రలోని ధర్మాబాద్ ప్రాంతానికి వెళ్లి ఇంటికి తిరిగి వస్తుండగా మార్గమధ్యలో మహారాష్ట్ర సరిహద్దు వద్ద అతివేగంతో రావడంతో ద్విచక్రవాహనం అదుపుతప్పి కింద పడిపోవడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. మృతునికి భార్యతో పాటు ఒక కుమారుడు , కూతురు ఉన్నాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ మహేష్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News