Monday, December 23, 2024

వెనుకబడిన వర్గాల విద్యాభివృద్దికి కేరాఫ్ కెసిఆర్ సర్కార్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: వెనుకబడిన వర్గాల సమగ్ర అభివృద్ది కోసం సిఎం కెసిఆర్ సర్కార్ నిరంతరం కృషి చేస్తున్నట్లు రాష్ట్రవ్యాప్తంగా 17 నూతన బిసి డిగ్రీ గురుకులాలు ప్రారంభించడానికి జీవో జారీ చేయడమే అందుకు నిదర్శనమని బిసిసంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొంటూ తెలంగాణకు పూర్వం కేవలం 19 బిసి గురుకులాలు అరకొర వసతులతో ఉండేవని, ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పంతో 327కు పెంచినట్లు, విద్య ద్వారా వెనుకబడిన వర్గాల జీవితాల్లో సమూల మార్పులు వస్తాయని నమ్మే సీఎం కెసిఆర్ అందుకోసం నిరంతరం కృషి చేస్తున్నట్లు తెలిపారు. కేవలం బిసి గురుకులాల ద్వారానే రాష్ట్రంలో దాదాపు 2లక్షల మంది వెనుకబడిన బిడ్డలు ప్రపంచస్థాయి ప్రమాణాలతో విద్యనభ్యసిస్తారని ఆనందం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కెసిఆర్‌కు గంగుల ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. గత సంవత్సరం 15 డిగ్రీ కాలేజీలను మంజూరు చేసి తరగతులు ప్రారంభించుకున్నామని వాటి ద్వారా 15,360 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారని, ఈ సంవత్సరం ప్రారంభించే డిగ్రీ కాలేజీల్లో 16,320 మందికి లబ్దీ చేకూరుతుందన్నారు. కేవలం డిగ్రీ గురుకులాల్లోనే 31,680 మందికి ప్రపంచస్థాయి విద్యను అందిస్తామన్నారు. ఈ నూతన డిగ్రీకాలేజీలతో రాష్ట్రంలోని ప్రతీ జిల్లాలో బిసి గురుకుల డిగ్రీ కాలేజీ ఏర్పాటవుతుందన్నారు. ఈఏడాది కొత్త బిసి డిగ్రీ గురుకులాలను జోగులాంబ గద్వాల్, నారాయణ్ పేట్, నాగర్ కర్నూల్, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, అదిలాబాద్, కొమరంబీం అసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, హన్మకొండ, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట్, మరియు యాదాద్రి భువనగిరి జిల్లాల్లో ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.

లక్ష సాయం దరఖాస్తుల పరిశీలన
వెనుకబడిన వర్గాల లక్ష సహాయం కోసం క్షేత్ర స్థాయిలో దరఖాస్తుల పరిశీలన ప్రారంభమైందని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. మొత్తం 5,28,862 దరఖాస్తులు వచ్చినట్లు, వర్గాల వారిగా బిసి-ఏ 2,66,001, బిసి-బి 1,85,136, బిసి-డి 65,310 ఎంబిసిలు 12,415 మంది దరఖాస్తు చేసుకున్నట్లు వెల్లడించారు. దరఖాస్తుల క్రమసంఖ్య ప్రకారం పరిశీలన కొనసాగుతుందని, ప్రతీ నెల 5వ తారీఖు వరకు పరిశీలన పూర్తియిన వారికి అదేనెల 15వ తారీఖున స్థానిక శాసనసభ్యుల చేతుల మీదుగా అందజేస్తామని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News